ఆకాశంలో భోజనం చేస్తారా? అయితే నోయిడా వెళ్లండి! - noida
🎬 Watch Now: Feature Video
భూమికి 160 అడుగుల ఎత్తులో భోజనం తింటున్నట్లు ఊహించుకోండి! ఆ ఊహ ఎంతో అద్భుతంగా ఉంది కదూ. ఆహారం ,సాహసం కలగలపిన వింత అనుభవాన్ని అందిస్తోంది ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలో ఉన్న ఫ్లై డైనింగ్ అడ్వెంచర్ సంస్థ. 24 సీట్లతో గుండ్రంగా ఉండే భారీ టేబుల్‌ను క్రేన్‌తో పైకి లేపి. వినియోగదారులకు విందు వడ్డిస్తారు. వెయిటర్లు ఇతర సిబ్బంది వినియోగదారులకు పలు రకాల వంటకాలతో సహా శీతల పానియాలు అందిస్తారు. వాటితో పాటే ఉర్రూతలూగించే డీజే కూడా అందుబాటులో ఉంటుంది. ఇతర రెస్టారెంట్లకు పూర్తి భిన్నంగా ఉండి సందర్శకులకు ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తోంది ఈ స్కై హోటల్.
Last Updated : Oct 9, 2019, 6:17 AM IST