iPhone 17 Pro and iPhone 17 Design Leaked: యాపిల్ ఇప్పట్లో తన ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లను లాంఛ్ చేసే అవకాశం లేదు. వీటి రిలీజ్‌కు ఇంకా చాలా నెలల సయయం ఉంది. అయితే ఈ వీటి వివరాలు మాత్రం ఇప్పటికే ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సిరీస్‌లోని రెండు మోడల్స్ అంటే 'ఐఫోన్ 17', 'ఐఫోన్ 17 ప్రో' ఫోన్ల రెండర్స్ విడి విడిగా లీక్ అయ్యాయి.
అవి ఈ ఐఫోన్లు రియర్ ప్యానెల్లో అడ్డుగా సాగదీసినట్లుగా ఉన్న కెమెరా బార్‌ను కలిగి ఉంటాయని సూచిస్తున్నాయి. లీకైన ఒక రెండర్లో క్షితిజ సమాంతరంగా అమర్చిన రెండు వెనక కెమెరాలతో 'ఐఫోన్ 17' కన్పిస్తుంది. అయితే దీని 'ప్రో' మోడల్ దాని ప్రీవియస్ 'ఐఫోన్ 16 ప్రో' మాదిరిగానే కెమెరా లేఅవుట్‌ను కలిగి ఉంటుందని మరో లీక్డ్ రెండర్ సూచిస్తుంది.
ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో డిజైన్ (లీక్డ్): స్టాండర్డ్ 'ఐఫోన్ 17' మోడల్ రెండర్‌ను యూజర్ @MajinBuOfficial తన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అందులో కన్పిస్తున్న ఇమేజ్ను చూస్తే ఈ ఫోన్ రీడిజైన్డ్ రియర్ కెమెరా లేఅవుట్‌తో రావచ్చని తెలుస్తోంది. ఇక గతేడాది యాపిల్ ప్రీవియస్ మోడల్స్‌లో అందించిన వెర్టికల్ కెమెరా లేఅవుట్‌కు బదులుగా నిలువు కెమెరా లేఅవుట్‌తో 'ఐఫోన్ 16', 'ఐఫోన్ 16 ప్లస్' మోడల్స్‌ను తీసుకొచ్చింది.
అయితే కంపెనీ ఇప్పుడు 'ఐఫోన్ 17'లో ప్రైమరీ, అల్ట్రావైడ్ కెమెరాలను రెండు వైపులా విస్తరించి ఉన్న కెమెరా బార్‌లో అడ్డంగా అమర్చనున్నట్లు ఈ కొత్త రెండర్ సూచిస్తుంది. అంతేకాక అందులో కుడి వైపున LED ఫ్లాష్‌ను కూడా మనం చూడొచ్చు. ఇక ఈ రెండర్లో కెమెరా బార్ డార్క్ కలర్లో కన్పిస్తుంది. ఐఫోన్ మాత్రం వైట్ కలర్లో ఉంది. అంటే 'ఐఫోన్ 17' మోడల్ అన్ని కలర్ ఆప్షన్లలో కూడా కెమెరా బార్ ఒకే రంగును కలిగి ఉండే అవకాశం ఉంది.
According to the information I've managed to obtain, there is a version of the iPhone 17 design that mainly changed the camera layout compared to the previous version.
— Majin Bu (@MajinBuOfficial) February 13, 2025
It is assumed that the camera module of the base version is wider than that of the Air version with a single… pic.twitter.com/Egl2rw2iDl
మరోవైపు 'ఐఫోన్ 17 ప్రో' మోడల్‌పై కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ రూమర్డ్ 'ఐఫోన్ 17 ప్రో' మోడల్‌ను జాన్ ప్రాసర్ ఫ్రంట్‌పేజ్‌టెక్ యూట్యూబ్ ఛానెల్‌లోని వీడియోలో చూడొచ్చు. అందులో ఇది 'ఐఫోన్ 17' మాదిరిగానే అడ్డుగా సాగదీసినట్లుగా ఉన్న కెమెరా బార్‌తో కనిపించినప్పటికీ ఇది చాలా సుపరిచితమైన డిజైన్‌తో మూడు రియర్ కెమెరాలను కలిగి ఉంది. అయితే దీని కెమెరా బార్ 'ఐఫోన్ 17' కంటే కాస్తంత విశాలంగా ఉంది.
ప్రీవియస్ రెండర్స్లో క్షితిజ సమాంతరంగా అమర్చిన మూడు రియర్ కెమెరాలతో 'ఐఫోన్ 17 ప్రో' మోడల్‌ను చూపించిన విధంగా కాకుండా, ఫ్రంట్‌పేజ్‌టెక్ రెండర్స్లో ఇది 'ఐఫోన్ 16 ప్రో' మాదిరిగా అదే లేఅవుట్‌తో ఉండటం కన్పిస్తుంది. దీనిలో LED ఫ్లాష్ కెమెరా బార్ కుడివైపున చివరిలో ఉంటుంది. అయితే 'ఐఫోన్ 17' సిరీస్ లాంఛ్ కావడానికి ఇంకా చాలా నెలల సమయం ఉందని పాఠకులు (రీడర్స్) గమనించాలి.
ఇదిలా ఉండగా యాపిల్ ఈ ఏడాది 'ఐఫోన్ 16 ప్లస్' సక్సెసర్ స్థానంలో 'ఎయిర్' మోడల్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ప్రస్తుతం ఎటువంటి కచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. దీనిపై మరిన్ని వివరాలు ప్రారంభానికి కొన్ని నెలల ముందు వెలువడే అవకాశం ఉంది.
డైనమిక్ లైట్ ఫీచర్, అతిపెద్ద బ్యాటరీతో వివో 5G స్మార్ట్‌ఫోన్- రూ. 15,000లకే!
గగన్‌యాన్‌తో మరో అద్భుతానికి ఇస్రో రెడీ!- ఈ ఏడాదే మొదటి ఫ్లైట్ లాంఛ్- షెడ్యూల్ ఇదే!
వాట్సాప్‌లో భలే కొత్త ఫీచర్- ఇకపై మీ చాట్‌ను రంగులతో నింపేయొచ్చు- ఎలాగంటే?