Telangana Man Wedding With An American Girl : ప్రేమ బంధానికి హద్దులు, సరిహద్దులు ఉండవంటారు. మనసులు కలిసిన మనుషులను ఈ సృష్టిలో ఏదీ విడదీయలేదంటుంటారు. దేశం కాని దేశంలో భాషలు, సంస్కృతులు వేరైనప్పటికీ ప్రేమకు ఎల్లలు లేవని నిరూపించిన ఆ జంట ఇప్పుడు ఒక్కటయ్యారు. అమెరికా అమ్మాయితో తెలంగాణ అబ్బాయి వివాహం ఘనంగా జరిగింది. ఇంతకీ వారిద్దరి ప్రేమ పెళ్లి విశేషాలేంటో తెలుసుకుందామా?
ఎల్లలు దాటిన ప్రేమ : వివరాల్లోకి వెళితే హనుమకొండ జిల్లాలో ఆత్మకూరు మండలంలోని నీరుకుల్లా గ్రామానికి చెందిన రఘునాథ్ రావు, వైశాలి దంపతుల కుమారుడు సతీశ్ చంద్ర ఉన్నత చదువుల కోసం 10 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. చదువు పూర్తి అయిన తర్వాత అక్కడ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే 2021 సంవత్సరంలో అమెరికాలోని టొరంటో రాష్ట్రానికి చెందిన జెస్సికాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.
"మాస్టర్స్ కోర్సు విద్యనభ్యసించడానికి 2013లో నేను అమెరికా వెళ్లాను. 2021లో తనతో(జెస్సికా) పరిచయం ఏర్పడింది. సుమారు ఏడాది తర్వాత మా అమ్మనాన్నలకు అమ్మాయి గురించి వివరించడం జరిగింది. అమ్మాయి పెళ్లి చేసుకుంటుందా? తదితర విషయాలన్నీ అడిగి తెలుసుకున్నాకే ఇక్కడకు వచ్చి తల్లిదండ్రుల అంగీకారంతో వివాహం చేసుకోవడం జరిగింది" - సతీశ్ చంద్ర, హనుమకొండ వాసి
అమెరికా అమ్మాయి తెలంగాణ అబ్బాయి ప్రేమ పెళ్లి : ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో ఇరు కుటుంబాల అంగీకారంతో హిందూ సంప్రదాయం ప్రకారం హనుమకొండలోని పెద్దమ్మ ఏఆర్ గార్డెన్లో వివాహ బంధంతో వధూవరులిద్దరూ ఒక్కటయ్యారు. హిందూ సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందని అమెరికా యువతి జెస్సికా తెలిపారు. భారత్లో సినిమాలు కూడా చూశానని వాటిలో పుష్ప మూవీ అంటే తనకు ఎంతగానో ఇష్టమని పేర్కొన్నారు.
వాలంటైన్స్ వీక్ వేళ - అమెరికా అమ్మాయి, ఆంధ్రా అబ్బాయితో దూందాంగా పెళ్లి
ఖండాంతరాలు దాటిన ప్రేమ.. ఒక్కటైన భద్రాద్రి అబ్బాయి.. అమెరికా అమ్మాయి