Malla Reddy Rides Old Milk Bike : మాజీ మంత్రి మల్లారెడ్డి అనగానే మనకు గుర్తొచ్చేది పాలమ్మిన, పూలమ్మిన, కష్టపడ్డా అనే డైలాగ్. ఈ మాస్ డైలాగ్‌లతో అంత వరకు రాజకీయ నేతల్లో పేరు పొందిన మల్లారెడ్డి ఒక్కసారిగా యూత్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు. యూత్‌కు మల్లారెడ్డి ఓ ఐకాన్‌గా మారారు. మల్లారెడ్డి ఎక్కడికి వెళ్లినా అందరితో సరదాగా మాట్లాడుతూ నవ్వులు పూయిస్తారు.
పాల డబ్బా స్కూటర్‌తో మల్లారెడ్డి : తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి సందడి చేశారు. ఓ కార్యక్రమానికి వెళ్లిన మల్లారెడ్డికి పాల డబ్బాతో స్కూటర్ కనిపించింది. పాలమ్మి కష్టపడ్డా అన్నట్లుగానే పాత రోజులు గర్తుకువచ్చాయేమో కానీ వెంటనే స్కూటర్‌పై ఎక్కి సందడి చేశారు. స్కూటర్ నడుపుతూ సరదాగా అందరితో ఫొటోలు దిగారు. అందరినీ తన డైలాగ్‌లతో నవ్వించారు. పాలు అమ్మిన వాళ్లు ఎప్పటికైనా సక్సెస్ అవుతారని పొగిడారు. స్కూటర్‌పై పాలు అమ్ముతున్న ఆ వ్యాపారిని శాలువాతో సన్మానించారు. ఒకప్పుడు తాను కూడా స్కూటర్ పైనే పాల వ్యాపారం చేసే వాడినని గుర్తు చేసుకున్నారు. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.