జనతా కర్ఫ్యూ: 'మహా'నగరం మూతపడిన వేళ... - కరోనా వైరస్
🎬 Watch Now: Feature Video
జనతా కర్ఫ్యూతో మహారాష్ట్రలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ముఖ్యంగా.. నిత్యం ఉరుకులు పరుగులు పెట్టే ముంబయివాసులు ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ఫలితంగా రోడ్లన్నీ వెలవెలబోతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం.. మహారాష్ట్రలోనే అధికంగా ఉంది. దేశంలో మొత్తం 324 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒక్క మహారాష్ట్రలోనే 74మంది వైరస్ బారిన పడ్డారు. వీరిలో ఇద్దరు మరణించారు.