Coconut Water Benefits in Winter: చలికాలంలో ఎక్కువగా దాహం వేయకపోవడం వల్ల చాలా మంది నీళ్లు సరిగ్గా తాగరు. ఇలా నిర్లక్ష్యం చేస్తే శరీరం డీహైడ్రేషన్‌కి గురికావడమే కాకుండా.. ఆరోగ్యానికి నష్టం వాటిల్లుతుందని నిపుణులు అంటున్నారు. ఇంకా చర్మం కూడా తేమను కోల్పోతుందని చెబుతున్నారు. ఇలా జరగకుండా ఉండాలంటే శీతాకాలంలోనూ రుచికరమైన కొబ్బరి నీళ్లను తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఫలితంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలూ చేకూరతాయని వివరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా గుండె సంబంధిత సమస్యల ముప్పు కూడా తగ్గుతుందని అంటున్నారు. 2015లో Journal of Medicinal Foodలో ప్రచురితమైన "Coconut Water Reduces Blood Pressure in Hypertensive Individuals" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. అంతేకాకుండా ఇది శరీరంలోని చక్కెర స్థాయుల్ని కూడా అదుపులో ఉంచుతుందని వివరిస్తున్నారు.(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
- కొబ్బరి నీళ్లలో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుందని వివరిస్తున్నారు.
- చాలామందికి ప్రెగ్నెన్సీ సమయంలో ఆహారం త్వరగా జీర్ణం కాకపోవడం, మలబద్ధకం మొదలైన సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. అయితే, వీటిని తగ్గించుకోవాలంటే కొబ్బరి నీళ్లు తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కొబ్బరి నీళ్లలో క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు, కండరాలు దృఢంగా తయారవుతాయని వివరిస్తున్నారు.
- ఇంకా కొబ్బరి నీళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మానికి, శరీరానికి తేమను అందిస్తాయని నిపుణులు అంటున్నారు. ఫలితంగా చర్మం పొడిబారకుండా జాగ్రత్తపడవచ్చని చెబుతున్నారు.
- ఇందులో తక్కువ మొత్తంలో కొవ్వులు ఉండటం వల్ల బరువు పెరిగే అవకాశం కూడా తక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
- మూత్రపిండాల సంబంధిత సమస్యతో బాధపడే వారికి కూడా కొబ్బరి నీళ్లు మంచి ఔషధంలా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలే ఇందుకు కారణమని చెబుతున్నారు.
- కొబ్బరి నీళ్లలో సోడియం, చక్కెరలు తక్కువగా.. క్లోరైడ్, క్యాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా శరీరం హైడ్రేట్ అవడంతో పాటు పునరుత్తేజితమవుతుందని అంటున్నారు.
- కండరాల తిమ్మిరి సమస్యతో బాధపడే వారు కొబ్బరి నీళ్లు తాగితే ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లలో అధిక మొత్తంలో ఉండే పొటాషియమే దీనికి కారణమని అంటున్నారు.
- ప్రతి రోజు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే కొబ్బరి నీళ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కాళ్లు, చేతుల వాపును తగ్గిస్తాయని వివరిస్తున్నారు.
- అయితే ఇలా అనేక ప్రయోజనాలున్నప్పటికీ.. కొంతమందికి మాత్రం ఈ కాలంలో కొబ్బరి నీళ్లు పడకపోవచ్చని నిపుణులు అంటున్నారు. అలాంటి సందర్భాల్లో వీటికి దూరంగా ఉండడమే మంచిదని సలహా ఇస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీరు ఎలా నడుస్తున్నారు? వాకింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా?
ఇవి తింటే క్యాన్సర్ వచ్చే రిస్క్ తక్కువట- అవేంటో మీకు తెలుసా?