దొంగతనం చేశాడని చెట్టుకు వేలాడదీసి.. తీవ్రంగా కొట్టి..

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 10, 2021, 8:20 PM IST

రాజస్థాన్‌లోని భిల్వాడాలో అమానుష ఘటన వెలుగుచూసింది. మేకను దొంగతనం చేశాడనే ఆరోపణలతో దళిత యువకుడిని చిత్రహింసలు పెట్టారు గ్రామస్థులు. మోహన్‌పురా గ్రామంలో 10 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు వ్యక్తులు ఓ యువకుణ్ని కర్రలతో తీవ్రంగా కొడుతుండగా.. బాధిత యువకుడు విలవిల్లాడిపోతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు, నిందితులు ఒకే గ్రామానికి చెందినవారని డిప్యూటీ ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన భాజపా.. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని మండిపడింది. అయితే మేక దొంగతనం ఆరోపణలను బాధితుడు ఖండించాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.