పురిటి నొప్పులతో భారీ ట్రాఫిక్‌లో చిక్కుకున్న గర్భిణీ.. తర్వాత ఏమైందంటే! - ముస్సోరీలో హిమపాతం
🎬 Watch Now: Feature Video
ఉత్తరాఖండ్ ముస్సోరీలో ట్రాఫిక్‌లో చిక్కుకున్న గర్భిణీని స్థానికులు, పోలీసులు కలిసి ఆస్పత్రికి తరలించారు. ముస్సోరీలో ఎడతెగకుండా మంచువర్షం కురుస్తోంది. దీని కారణంగా శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో రోడ్డుపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిపోయాయి. ఈ సమయంలోనే పురిటి నొప్పులతో ట్రాఫిక్‌లో చిక్కుకుని అవస్థలు పడుతోంది ఓ గర్భిణి. ఈ క్రమంలో ఆమె భర్త.. ఇతర వాహనదారులను సాయం కోరాడు. స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసుల సహకారంతో గర్భిణీని ట్రాఫిక్ దాటించారు. తల్లి, బిడ్డను కాపాడారు.