భాజపా ఆఫీస్ ముట్టడికి యత్నం.. పంచాయతీ సెక్రటరీలపైకి జలఫిరంగులు - బిహార్లో పంచాయతీ కార్యదర్శుల నిరసన
🎬 Watch Now: Feature Video

Panchayat Secretaries Protest Bihar: బిహార్లోని పట్నాలో వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ సెక్రటరీలు కొద్దిరోజులుగా చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. నిరసనలో భాగంగా సోమవారం భాజపా కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు కార్యదర్శులు. దీంతో అక్కడున్న పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు వారిపై జలఫిరంగులు ప్రయోగించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు లాఠీ ఛార్జీ చేశారు.
'పంచాయతీ సెక్రటరీలు చట్టవిరుద్ధంగా నిరసన చేస్తున్నారు, రాష్ట్రమంత్రితో చర్చలు జరిపేందుకు అపాయింట్మెంట్ దొరికినా, వాళ్లు ఆందోళనకు దిగారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు జలఫిరంగులు, బాష్పవాయువును ప్రయోగించాం. ఈ ఘటనలో 50 మంది పోలీసులు గాయపడ్డారు' అని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎంఎస్. ఖాన్ తెలిపారు.