చేతికర్రతోనే చిరుతను తరిమికొట్టిన బామ్మ..! - చిరుత దాడులు
🎬 Watch Now: Feature Video
ముంబయి గోరెగావ్ (leopard attack mumbai) ప్రాంత వాసులను వారం రోజులుగా చిరుతపులి హడలెత్తిస్తోంది. రాత్రిళ్లు జనావాసాల్లో సంచరిస్తున్న చిరుత ఒంటరిగా కనిపించినవారిపై దాడులు చేస్తోంది. బుధవారం రాత్రి ఒంటరిగా ఇంటి బయట కూర్చున్న వృద్ధురాలిపై చిరుత దాడి చేసింది. వెనుక నుంచి వచ్చిన చిరుత ఆమెపై దాడికి దిగింది. సరిగ్గా దాడిచేసే సమయంలో వెనక్కితిరిగిన వృద్ధురాలు.. నడిచేందుకు ఆసరాగా తెచ్చుకున్న ఊతకర్రతో చిరుతపై ఎదురుదాడి దిగింది. వృద్ధురాలి ప్రతిఘటనతో చిరుతపులి అక్కడి నుంచి పారిపోయింది.
ఆమెకు స్వల్పగాయాలైనట్లు స్థానికులు వెల్లడించారు. వారంరోజుల్లో మనుషులపై చిరుతదాడి చేయడం ఇది మూడోసారని స్థానికులు తెలిపారు. బామ్మపై చిరుతదాడి దృశ్యాలు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి.
Last Updated : Sep 30, 2021, 1:14 PM IST