ETV Bharat / technology

ట్రాయ్ ఆదేశాలు- రీఛార్జ్ ప్లాన్​లు ఒకేసారి రూ.210 తగ్గింపు! - AIRTEL JIO VI CALLING SMS PLANS

ఎయిర్​టెల్ బాటలోనే జియో- ఆ ప్లాన్​ల ధరలు భారీగా తగ్గింపు!

Airtel Jio Vi Calling SMS Plans
Airtel Jio Vi Calling SMS Plans (Photo Credit- AIRTEL, JIO, VI)
author img

By ETV Bharat Tech Team

Published : Jan 27, 2025, 4:38 PM IST

Airtel Jio Vi Calling SMS Plans: వినియోగదారులు బలవంతంగా డేటాను కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా కాలింగ్, SMS ఓన్లీ ప్లాన్​లను మాత్రమే ప్రారంభించాలని దేశంలోని టెలికాం సంస్థలకు ట్రాయ్ ఆదేశించింది. దీంతో ఈ మేరకు భారతీ ఎయిర్​టెల్, జియో, వీఐ (వొడాఫోన్-ఐడియా) వంటి సంస్థలు కొత్త ప్లాన్​లను తీసుకొచ్చాయి.

అయితే వాటి ధరలు ఎక్కువగా ఉండటంతో ఈ కొత్త ప్లాన్‌ల ధరను తగ్గించాలని టెలికాం కంపెనీలను ట్రాయ్ సూచించినట్లు సమాచారం. దీంతో వీటిని తీసుకొచ్చిన కొన్ని రోజుల్లోనే వీటి ధరలను తగ్గిస్తూ ఎయిర్​టెల్, ఐడియా కొత్త ప్లాన్​లను ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో జియో, ఎయిర్​టెల్, వీఐ కొత్త కాలింగ్ అండ్ SMS ఓన్లీ ప్లాన్​లపై పూర్తి వివరాలు మీకోసం.

1. జియో కొత్త కాలింగ్ ప్లాన్లు:

రూ.458 ప్లాన్ రూ.448కి తగ్గింపు: కొన్ని రోజుల క్రితం జియో కాలింగ్, SMS కోసం రూ.458 ధరతో కొత్త ప్లాన్‌ను ప్రారంభించింది. అయితే ఇది తీసుకొచ్చిన కొన్ని రోజుల్లోనే కంపెనీ ఈ కొత్త ప్లాన్ ధరను రూ.10 తగ్గించింది. కంపెనీ ఇప్పుడు ఈ ప్లాన్‌ను రూ.448కి లిస్ట్ చేసింది.

అయితే కంపెనీ ఈ ప్లాన్ ప్రయోజనాల్లో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. ఈ ధరకే కంపెనీ వినియోగదారులకు అన్​లిమిటెడ్ కాలింగ్, 1000 SMS సౌకర్యాన్ని అందిస్తుంది. దీని వ్యాలిడిటీ 84 రోజులు. వీటితో పాటు ఈ ప్లాన్​తో వినియోగదారులు జియో సినిమా, జియో యాప్, జియో క్లౌడ్ బెనిఫిట్స్​ను కూడా పొందొచ్చు.

1958 రూపాయల ప్లాన్ రూ.1748కి తగ్గింపు: కొన్ని రోజుల క్రితం జియో కొత్తగా ప్రారంభించిన కాలింగ్ ప్లాన్‌ల జాబితాలో 365 రోజుల వ్యాలిడిటీతో ఈ రూ.1958 ప్లాన్‌ను ప్రారంభించింది. అయితే ఇప్పుడు కంపెనీ ఈ ప్లాన్ ధరను కూడా తగ్గించింది. దీనిపై రూ.210 తగ్గించి రూ. 1748లతో కొత్త ప్లాన్​ను తీసుకొచ్చింది. అయితే జియో ఈ ప్లాన్​ వ్యాలిడిటీని 365 రోజుల నుంచి 336 రోజులకు తగ్గించింది.

అంటే జియో ఈ కొత్త రూ.1748కి కాలింగ్ ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీతో అన్​లిమిటెడ్ కాలింగ్, మొత్తం 3,600 SMSలను అందిస్తుంది. దీనితో పాటు ఈ ప్లాన్​తో వినియోగదారులు జియో టీవీ, జియో సినిమా (నాన్-ప్రీమియం), జియో క్లౌడ్ ప్రయోజనాలను కూడా పొందుతారు.

2. ఎయిర్‌టెల్ కొత్త కాలింగ్ ప్లాన్స్:

రూ.499 ప్లాన్​ రూ.469కి తగ్గింపు: ఎయిర్‌టెల్ కూడా కొన్ని రోజుల క్రితం రూ.499 కాలింగ్ ప్లాన్‌ను ప్రారంభించింది. కానీ కేవలం రెండు రోజుల తర్వాత కంపెనీ ఈ ప్లాన్ ధరను రూ.469కి తగ్గించింది. అయితే కంపెనీ దాని ప్రయోజనాలలో ఎటువంటి మార్పులు చేయలేదు.

ఎయిర్‌టెల్ ఈ కొత్త రూ.469 ప్లాన్‌లో వినియోగదారులు అన్​లిమిటెడ్ కాలింగ్, మొత్తం 900 SMSల సౌకర్యాన్ని పొందుతారు. ఈ ప్యాక్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. దీనితో పాటు అపోలో 24/7 సర్కిల్ మెంబర్​షిప్, 3 నెలల పాటు ఉచిత హలో ట్యూన్‌లు కూడా లభిస్తాయి.

రూ.1959 ప్లాన్ రూ.1849 తగ్గింపు: ఎయిర్‌టెల్ కూడా దీర్ఘకాలిక కాలింగ్ ప్లాన్‌ను ప్రారంభించింది. దీని ధర 1959 రూపాయలు. కానీ కంపెనీ దీన్ని రూ.1849లకు తగ్గించింది. అయితే దీని ప్రయోజనాలలో ఎటువంటి మార్పులు చేయలేదు.

ఎయిర్‌టెల్ ఈ కొత్త రూ.1849 ప్లాన్‌తో వినియోగదారులు 365 రోజుల పాటు అన్​లిమిటెడ్ కాలింగ్, మొత్తం 3600 SMSల సౌకర్యాన్ని పొందుతారు. దీనితో పాటు అపోలో 24/7 సర్కిల్ మెంబర్​షిప్, 3 నెలల పాటు ఉచిత హలో ట్యూన్‌లు కూడా లభిస్తాయి.

3. వొడాఫోన్-ఐడియా కొత్త కాలింగ్ ప్లాన్స్: TRAI సూచనల ప్రకారం వోడాఫోన్-ఐడియా అంటే VI కూడా ఒకే కాలింగ్-SMS ప్లాన్‌ను ప్రారంభించింది. దీని ధర రూ. 1460. ఈ ప్లాన్​తో అన్​లిమిటెడ్ వాయిస్ కాలింగ్​తో పాటు 100 SMS సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ 270 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అయితే ఈ ప్లాన్‌తో VI దాని వినియోగదారులకు ఎటువంటి అదనపు ప్రయోజనాలను అందించట్లేదు.

రాయల్​ ఎన్​ఫీల్డ్ డిమాండ్ లేదుగా- ఏకంగా 5లక్షల మంది కొన్న మోడల్ ఇదే!​

గ్లోబల్ మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్- చౌక ధరకు ఎక్కడ లభిస్తాయంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.