ETV Bharat / state

ఖాతాల్లో రైతుభరోసా డబ్బులు పడ్డాయి! - ఓసారి చెక్ చేసుకోండి - MINISTER TUMMALA ON RYTHU BHAROSA

రైతుభరోసా డబ్బుల జమ కొనసాగుతోందన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు - తొలివిడతలో మండలానికో గ్రామంలో సొమ్ము విడుదల చేశామని వెల్లడించిన మంత్రి

Minister Tummala Nageswara Rao On Rythu Bharosa
Minister Tummala Nageswara Rao On Rythu Bharosa (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 27, 2025, 4:57 PM IST

Updated : Jan 27, 2025, 5:33 PM IST

Minister Tummala Nageswara Rao On Rythu Bharosa : అర్హులైన రైతుల ఖాతాల్లో రైతుభరోసా డబ్బులను జమ చేసే ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తొలివిడతలో భాగంగా మండలానికొక గ్రామంలో రైతుభరోసా సొమ్మును విడుదల చేసినట్లుగా వివరించారు. రాష్ట్రంలో 4,41,911 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నేడు 593 కోట్ల రూపాయలు జమ అయ్యాయని తుమ్మల వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జనవరి 26న రైతుభరోసా పథకం ప్రారంభమైందని తెలిపారు. సాగు చేస్తున్న ప్రతి ఎకరానికి రూ. 6000 చొప్పున అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తామన్నారు.

అర్హులైన ప్రతిరైతుకూ రైతుభరోసా జమచేస్తాం : రైతు భరోసా పథకం నిధులు జిల్లాలో ప్రతి మండలానికి ఒక్కో గ్రామం చొప్పున మొదట విడుదల చేయడం జరిగిందని మంత్రి తుమ్మల వెల్లడించారు. విడుదల చేసిన నిధులు ఈ రోజు రైతుల అకౌంట్లలో జమ చేసినట్లుగా ఆయన వివరించారు. రైతు భరోసా నిధుల విడుదల రెవెన్యూ గ్రామాల వారీగా జరుగుతుంది కనుక కొన్ని జిల్లాలలో మండలానికి ఒకటి కంటే ఎక్కువ గ్రామాల సంఖ్య కనపడుతుందని తుమ్మల స్పష్టం చేశారు.

వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయభరోసా నిధుల జమకూడా కొనసాగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. అర్హులైన ప్రతిరైతుకు రైతుభరోసా నిధులను జమచేస్తామని ఆయన స్పష్టం చేశారు. సాగుయోగ్యం కాని భూముల గుర్తింపు సర్వేకొనసాగుతుందని ఆయన వివరించారు. మార్చి 31లోపు లబ్ధిదారులందరికీ నిధుల జమ పూర్తిచేస్తామని తెలిపారు.

రైతు భరోసా నిధులు ఏ జిల్లాకు ఎంత విడుదలయ్యాయంటే :

  • ఆదిలాబాద్ జిల్లాలో 17 మండలాల్లోని 21 గ్రామాలకు చెందిన 6,411 మంది రైతుల బ్యాంకు భాగాల్లో రూ.14.49 కోట్లు జమ అయ్యాయి.
  • భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో 23 మండలాల్లోని 25 గ్రామాలకు చెందిన 22,242 రైతులకు రూ. 39.07 కోట్లు జమ అయ్యాయి.
  • హన్మకొండ జిల్లాలో 12 మండలాల్లో 12 గ్రామాలకు చెందిన 12,545 రైతులకు రూ. 14.30 కోట్లు జమ అయ్యాయి.
  • జగిత్యాల జిల్లాలో 20 మండలాల్లో 20 గ్రామాలకు చెందిన 22,242 రైతులకు రూ. 39.07 కోట్లు జమ అయ్యాయి.
  • జనగామ జిల్లాలో 12 మండలాల్లోని 12 గ్రామాలకు చెందిన 12,320 రైతులకు రూ. 15.91 కోట్లు జమ అయ్యాయి.
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 12 మండలాల్లోని 12 గ్రామాలకు చెందిన 7,073 రైతులకు రూ.8.67 కోట్లు జమ అయ్యాయి.
  • జోగులాంబ గద్వాల జిల్లాలో 13 మండలాల్లోని 13 గ్రామాలకు చెందిన 7,829 రైతులకు రూ. 12.47 కోట్లు జమ అయ్యాయి.
  • కామారెడ్డి జిల్లాలో 22 మండలాలోని 24 గ్రామాలకు చెందిన 9,062 రైతులకు రూ.8.35 కోట్లు జమ అయ్యాయి.
  • కరీంనగర్ జిల్లాలో 15 మండలాల్లోని 15 గ్రామాలకు చెందిన 14,226 రైతులకు రూ.15.96 కోట్లు జమ అయ్యాయి.
  • ఖమ్మం జిల్లాలో 21 మండలాల్లోని 21 గ్రామాలకు చెందిన 20,802 రైతులకు రూ.28.42 కోట్లు జమ అయ్యాయి.
  • కోమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 15 మండలాల్లోని 19 గ్రామాలకు చెందిన 4,344 రైతులకు రూ.8.62 కోట్లు జమ అయ్యాయి.
  • మహబూబాబాద్ జిల్లాలో 18 మండలాల్లోని 19 గ్రామాలకు చెందిన 14,611 రైతులకు రూ.18.14 కోట్లు జమ అయ్యాయి.
  • మహబూబ్ నగర్ జిల్లాలో 16 మండలాల్లోని 16 గ్రామాలకు చెందిన 14,575 రైతులకు రూ. 17.27 కోట్లు జమ అయ్యాయి.

జిల్లాల వారిగా విడుదలైన రైతుభరోసా నిధులు :

  • మంచిర్యాల జిల్లాలో 16 మండలాల్లోని 17 గ్రామాలకు చెందిన 7,143 రైతులకు రూ.8.72 కోట్లు జమ అయ్యాయి.
  • మెదక్ జిల్లాలో 21 మండలాల్లోని 21 గ్రామాలకు చెందిన 14,833 రైతులకు రూ. 14.06 కోట్లు జమ అయ్యాయి.
  • మేడ్చల్ జిల్లాలో 5 మండలాల్లోని 5 గ్రామాలకు చెందిన 2,706 రైతులకు రూ.3.14 కోట్లు జమ అయ్యాయి.
  • ములుగు జిల్లాలో 9 మండలాల్లోని 9 గ్రామాలకు చెందిన 6,678 రైతులకు రూ.8.26 కోట్లు జమ అయ్యాయి.
  • నాగర్ కర్నూల్ జిల్లాలో 20 మండలాల్లోని 20 గ్రామాలకు చెందిన 16,806 రైతులకు రూ. 23.05 కోట్లు జమ అయ్యాయి.
  • నల్గొండ జిల్లాలో 31 మండలాల్లోని 31 గ్రామాలకు చెందిన 35,568 రైతులకు రూ.46.93 కోట్లు జమ అయ్యాయి.
  • నారాయణపేట జిల్లాలో 13 మండలాల్లోని 13 గ్రామాలకు చెందిన 9,348 రైతులకు రూ. 13.87 కోట్లు అయ్యాయి.
  • నిర్మల్ జిల్లాలో 18 మండలాల్లో 18 గ్రామాలకు చెందిన 7,912 రైతులకు రూ. 10.56 కోట్లు జమ అయ్యాయి.
  • నిజామాబాద్ జిల్లాలో 31 మండలాల్లోని 31 గ్రామాలకు చెందిన 35,568 రైతులకు రూ.46.93 కోట్లు జమ అయ్యాయి.
  • పెద్దపల్లి జిల్లాలో 13 మండలాల్లోని 13 గ్రామాలకు చెందిన 9,885 రైతులకు రూ. 10.14 కోట్లు జమ అయ్యాయి.
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మండలాల్లోని 12 గ్రామాలకు చెందిన 9,724 రైతులకు రూ. 12.26 కోట్లు జమ అయ్యాయి.
  • రంగారెడ్డి జిల్లాలో 21 మండలాల్లోని 21 గ్రామాలకు చెందిన 15,597 రైతులకు రూ.20.32 కోట్లు జమ అయ్యాయి.
  • సంగారెడ్డి జిల్లాలో 25 మండలాల్లోని 25 గ్రామాలకు చెందిన 19,933 రైతులకు రూ. 24.15 కోట్లు జమ చేశారు.
  • సిద్దిపేట జిల్లాలో 26 మండలాల్లోని 26 గ్రామాలకు చెందిన 31,170 రైతులకు రూ. 36.76 కోట్లు జమ అయ్యాయి.
  • సూర్యాపేట జిల్లాలో 23 మండలాల్లోని 23 గ్రామాలకు చెందిన 29,352 రైతులకు రూ. 37.84 కోట్లు జమ అయ్యాయి.
  • వికారాబాద్ జిల్లాలో 20 మండలాల్లోని 20 గ్రామాలకు చెందిన 8,609 రైతులకు రూ.11.18 కోట్లు జమ అయ్యాయి.
  • వనపర్తి జిల్లాలో 15 మండలాల్లోని 15 గ్రామాలకు చెందిన 9,441 రైతులకు రూ.12.25 కోట్లు జమ అయ్యాయి.
  • వరంగల్ జిల్లాలో 11 మండలాల్లోని 11 గ్రామాలకు చెందిన 11,386 రైతులకు రూ. 12.86 కోట్లు జమ అయ్యాయి.
  • యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాల్లోని 17 గ్రామాలకు చెందిన 17,576 రైతులకు 26.95 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.

భూమి లేనివారికి ఆత్మీయ భరోసా, ఇల్లు లేకపోతే ఇందిరమ్మ ఇల్లు, అన్నదాతకు రైతు భరోసా : మంత్రి తుమ్మల

ప్రభుత్వం గుడ్​న్యూస్ - ఇక నుంచి వారికీ రైతు భరోసా

Last Updated : Jan 27, 2025, 5:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.