లైవ్ వీడియో: వైన్స్‌లోకి దూరి.. మందేసిన కోతి! - మద్యం తాగిన కోతి
🎬 Watch Now: Feature Video
మధ్యప్రదేశ్‌లో ఒక కోతి చేసిన చేష్టలు నవ్వులు పూయించాయి. మద్యం తనిఖీ అధికారి మాదిరే వైన్స్‌లోకి ప్రవేశించి అక్కడున్న ఫైల్స్‌ను పరిశీలించింది. అంతటితో ఆగక ఓ మద్యం బాటిల్‌ను తీసుకొని తాగుబోతులాగా మూతను తెరిచింది. బిస్కెట్లు తినిపించడానికి ప్రయత్నించినప్పటికీ నెట్టేస్తూ మద్యం సేవించింది. మండలా జిల్లా బహ్ని బజార్‌లోని ఓ వైన్స్‌లో జరిగిన ఈ ఘటన నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ కోతిని చూసేందుకు స్థానికులు పెద్దఎత్తున గుమిగూడారు.