VIRAL VIDEO: వేటాడే పులి శాకాహారిగా మారితే? - సత్పురా టైగర్ రిజర్వ్
🎬 Watch Now: Feature Video
ఆహారం కోసం వేటాడే పులినే టీవీలో, ఇంటర్నెట్లో చూసుంటారు. కానీ, గడ్డి తినే పులిని ఎప్పుడైనా చూశారా? అవును, మధ్యప్రదేశ్‌లోని హోశంగాబాద్‌లో ఉన్న సత్పురా టైగర్ రిజర్వ్‌లో ఈ సంఘటన జరిగింది. అక్కడ ఓ పెద్ద పులి.. సాధు జంతువులా ఆకులను తినడం చూసిన వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే జీర్ణక్రియను మెరుగుపరచుకోవడానికి కొన్నిసార్లు మాంసాహార జీవులు కూడా గడ్డి తింటాయని అధికారులు వివరించారు.