ChatGPT Down: ఓపెన్ ఏఐ తీసుకొచ్చిన ఏఐ ఆధారిత చాట్‌జీపీటీ సేవల్లో గురువారం అంతరాయం ఏర్పడింది. హఠాత్తుగా పనిచేయడం మానేసింది. వెబ్ సర్వర్ పనిచేయకపోవడంతో దీన్ని వినియోగిస్తున్న మిలియన్ల మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా వినియోగిస్తున్న ఈ చాట్‌బాట్ సేవలు డౌన్ కావడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
ప్రస్తుత కాలంలో చాట్‌జీపీటీ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఏదైనా విషయం కోసం టైప్ చేయాలన్నా, దేని గురించైనా తెలుసుకోవాలన్నా చాట్ జీపీటీలోనే సెర్చ్ చేస్తున్నారు. ఇది యూజర్ అడిగిన ప్రశ్నలను అర్థం చేసుకుని పూర్తి వివరాలతో చిటికెలో సమాధానాన్ని సిద్ధం చేసి అందజేస్తుంది. ఇలా వినియోగదారులకు కావాల్సిన సమాచారాన్ని క్షణాల్లో అందిచడంతో టెక్ ప్రియులు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
దీంతో ఇప్పుడు చాట్‌జీపీటీలో సేవలకు అంతరాయం ఏర్పడటంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తమ ఫిర్యాదులను చాట్‌జీపీటీకి ట్యాగ్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. అయితే చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్ఏఐ మాత్రం దీనిపై స్పందించలేదు. చాట్‌జీపీటీ డౌన్‌పై కారణాలను ఇంకా వెల్లడించలేదు. దీంతో వినియోగదారులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఈ చాట్‌బాట్ అంతరాయం ఎప్పుడు తొలగుతుందో కూడా క్లారిటీ లేకపోవడంతో నెట్టింట దీనిపై తెగ చర్చలు కొనసాగుతున్నాయి.
ట్రాయ్ ఆదేశాల మేరకు ఎయిర్టెల్ కొత్త ప్లాన్స్- ఇకపై డేటా కోసం అనవసరంగా డబ్బు చెల్లించక్కర్లేదు!
అదిరే ఏఐ ఫీచర్లతో గెలాక్సీ S25 అల్ట్రా- ధర కూడా 14వేలు పెరిగిందిగా!- మరి అంత రేటుకు ఇది విలువైనదేనా?
యమహాకు పోటీగా హీరో- సేమ్ పవర్, ఫీచర్లతో 'జూమ్ 160' లాంఛ్- అయితే వీటిలో బెస్ట్ ఆప్షన్ ఇదే!