Ranji Trophy 2025 : బీసీసీఐ విధించిన నిబంధనతో చాలా మంది స్టార్ క్రికెటర్‌లు రంజీ బాట పట్టారు. జనవరి 23 గురువారం ప్రారంభమైన రంజీ ట్రోఫీ ఆరో రౌండ్ బరిలో దిగారు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కి సెలక్ట్ అయిన ప్లేయర్‌లు, గాయపడిన ఆటగాళ్లు మినహా అందరూ రంజీ ఆడారు. ఈ లిస్టులో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, దేవదత్ పడిక్కల్ తదితరులు ఉన్నారు.
తొలి రోజు ఆటలో కొందరు స్టార్‌లు మాత్రమే అద్భుత ప్రదర్శన చేశారు. మిగిలిన వాళ్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. చాలా ఏళ్లకు రంజీ ఆడిన భారత ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
వీళ్లు ఫ్లాప్
ముంబయి- జమ్మూ కశ్మీర్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, యశస్వి, అజింక్యా రహానె, శ్రేయాస్ అయ్యర్ బరిలోకి దిగారు. ముంబయికి ప్రాతినిధ్యం వహిస్తున్న వీళ్లు తొలి రోజు ఫ్లాప్ షో చేశారు. రోహిత్ (3 పరుగులు), జైస్వాల్ (4 పరుగులు) సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. వీళ్లతోపాటు రహానే (12 పరుగులు), అయ్యర్ (11 పరుగులు), శిమమ్ దూబే (0) చెత్త ప్రదర్శన చేశారు.
ఇక పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న శుభ్‌మన్ గిల్ (4 పరుగులు) కర్ణాటకతో మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. మరో యువ ఆటగాడు రిషభ్ కూడా భారీ అంచనాలతో బరిలోకి దిగాడు. దిల్లీ జట్టుకు ఆడుతున్న పంత్ గురువారం సౌరాష్ట్రతో మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ మ్యాచ్‌లో పంత్ కూడా (1 పరుగు) తీవ్రంగా నిరాశపరిచాడు
వీళ్ల కమ్‌బ్యాక్ అదుర్స్
సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సూపర్ పెర్ఫార్మెన్స్తో కమ్‌బ్యాక్ ఇచ్చాడు. సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న జడేజా ఇవాళ దిల్లీతో మ్యాచ్‌లో బరిలో దిగాడు. బంతితో 5 వికెట్లు నేలకూల్చి మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. అలాగే బ్యాట్‌తోనూ 38 పరుగులు బాది సత్తా చాటాడు.
🚨 RAVINDRA JADEJA - FIVE WICKET HAUL IN THE RANJI TROPHY. 🚨
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 23, 2025
- Jadeja is back with a bang in Ranji. pic.twitter.com/GWIrhfqtrX
మరో ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా ఆకట్టుకున్నాడు. ముంబయి తరఫున బరిలో దిగిన శార్దూల్ హాఫ్ సెంచరీతో (51 పరుగులు) అలరించి జట్టును ఆదుకున్నాడు. బంతితోనూ రాణించి 1 వికెట్ దక్కించుకున్నాడు. వీరితోపాటు కర్ణాటక ప్లేయర్లు మయాంక్ అగర్వాల్ (20 పరుగులు), దేవదత్ పడిక్కల్ (27 పరుగులు) ఫర్వాలేదనిపించారు.
రంజీలో స్టార్ క్రికెటర్లు ఫెయిల్! - సింగిల్ డిజిట్‌కే రోహిత్, గిల్, జైస్వాల్ ఔట్