ETV Bharat / entertainment

'జాగ్రత్తగా ఇంటికెళ్లు, ఒక్కడివే తిరగొద్దు'- విష్వక్​కు బాలయ్య సూచన - VISHWAKSEN BALAKRISHNA

విష్వక్ సేన్ 'లైలా'- లేడి గెటప్​పై హీరో స్పందన

VISHWAKSEN Balakrishna
VISHWAKSEN Balakrishna (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2025, 8:55 PM IST

Vishwaksen Laila : టాలీవుడ్ యంగ్ హీరో విష్వక్ సేన్​ లీడ్​ రోల్​లో తెరకెక్కిన సినిమా 'లైలా'. దర్శకుడు రామ్‌ నారాయణ్ ఈ సినిమా రొమాంటిక్ కామెడీ​ డ్రామాగా తెరకెక్కించారు. ఈ సినిమాలో విష్వక్ లేడీ గెటప్​లో కనిపించనున్నారు. ఇటీవల రిలీజైన టీజర్​కు మంచి స్పందన వచ్చింది. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా గ్రాండ్​గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గురువారం ప్రెస్​మీట్ నిర్వహించి, సినిమా నుంచి ఓ సాంగ్ (ఇచ్చుకుందాం బేబీ) రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా విష్వక్ సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. 'టీజర్​లో మిమ్మల్ని లేడీ గెటప్ చూసి హీరో బాలకృష్ణ ఏం కాంప్లిమెంట్ ఇచ్చారు?' అని మీడియా విష్వక్​ను అడిగింది. దానికి విష్వక్ సింపుల్​గా 'ఇంటికి జాగ్రత్తగా వెళ్లు. ఒక్కడివే తిరగొద్దు అన్నారు' (నవ్వుతూ) రిప్లై ఇచ్చారు. అలాగే లేడీ గెటప్​ గురించి చాలానే మాట్లాడారు. ఈ గెటప్​లో వాళ్ల నాన్న కూడా తనను గుర్తుపట్టలేకపోయారని విష్వక్ చెప్పారు.

'మూవీ కోసం లేడీ గెటప్‌ వేసుకున్న తర్వాత మా నాన్నకు వీడియో కాల్‌ చేశా. చాలా సేపు ఇద్దరం సైలెంట్‌గా కెమెరా వైపు చూస్తూ ఉండిపోయాం. నన్ను గుర్తుపడతారేమోనని వెయిట్ చేశాను. ఆయన ఏమీ మాట్లాడకపోయే సరికి 'డాడీ నేను' అన్నాను. ఆయన ఒక్కసారి కంగారు పడిపోయారు. నా ఫోన్‌ నుంచి ఎవరో అమ్మాయి కాల్‌ చేసి, నాకు ఇస్తుందేమోనని ఆయన ఎదురు చూశారట. ఈ గెటప్​లో నా కన్న తండ్రే నన్ను గుర్తుపట్టలేదు. ఈ మూవీ మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది' విష్వక్ పేర్కొన్నారు.

కాగా, ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్​గా నటిస్తోంది. హీరో విష్వక్​సేన్ 'లైలా', 'సోను' అనే రెండు కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు. యోన్‌ జేమ్స్‌ సంగీతం అందిస్తున్నారు. రిచర్డ్‌ ప్రసాద్‌ ఛాయాగ్రహకుడిగా వ్యవహరిస్తున్నారు. షైన్ స్క్రీన్​ బ్యానర్​పై సాహు గరపాటి ఈ సినిమాను నిర్మించారు.

సైలెంట్​ ఓటీటీలోకి విష్వక్ మూవీ - 'మెకానిక్ రాకీ' ఎక్కడ స్ట్రీమ్ అవుతోందంటే?

విశ్వక్‌ సేన్‌ 'లైలా' టీజర్ ఔట్- లేడీ గెటప్​లో మాస్ కా దాస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.