ETV Bharat / technology

ట్రాయ్ ఆదేశాల మేరకు ఎయిర్​టెల్ కొత్త ప్లాన్స్- ఇకపై డేటా కోసం అనవసరంగా డబ్బు చెల్లించక్కర్లేదు! - AIRTEL VOICE SMS ONLY PREPAID PLANS

వాయిస్‌, SMSల కోసం ప్రత్యేక ప్లాన్లు తీసుకొచ్చిన ఎయిర్​టెల్- పూర్తి వివరాలు ఇవే!

Representational Picture of a Person Using a Smartphone
Representational Picture of a Person Using a Smartphone (ETV Bharat)
author img

By ETV Bharat Tech Team

Published : Jan 23, 2025, 7:33 PM IST

Airtel New Voice and SMS Only Prepaid Plans: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఆదేశాల మేరకు ఎయిర్​టెల్ వాయిస్‌, SMSల కోసం ప్రత్యేకంగా రెండు కొత్త రీఛార్జి ప్లాన్​లను లాంఛ్ చేసింది. రూ.499, రూ.1,959 ధరలతో ఈ రెండు ప్లాన్​లు వరుసగా 84 రోజులు, 365 రోజుల వ్యాలిడిటీతో వస్తున్నాయి.

ఎయిర్‌టెల్ కొత్త వాయిస్ అండ్ SMS ప్లాన్‌లు:

రూ. 499 రీఛార్జ్ ప్లాన్: ఈ ప్రీపెయిడ్ ప్యాక్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్​ ద్వారా వినియోగదారులకు అన్​లిమిటెడ్ కాలింగ్, మొత్తం 900 SMSలు లభిస్తాయి.

రూ. 1,959 రీఛార్జ్ ప్లాన్: ఈ ప్రీపెయిడ్ ప్యాక్ కూడా అన్​లిమిటెడ్ కాలింగ్​తో వస్తుంది. అయితే ఈ ప్లాన్​లో మొత్తం 3,600 SMSలు లభిస్తాయి. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 365 రోజులు.

ఈ రెండు ప్యాక్‌లలో మూడు నెలల పాటు అపోలో 24/7 సర్కిల్ మెంబర్​షిప్, ఉచిత హలో ట్యూన్స్‌తో సహా ఎయిర్‌టెల్ రివార్డ్‌లు ఉన్నాయి. అయితే ఎయిర్‌టెల్ ఇప్పుడు ఈ ప్లాన్‌లతో Xstream యాప్ ప్రయోజనాలను అందించడం లేదు. ఇందుకు కారణం ఈ ప్యాక్‌లు డేటా ప్రయోజనాలతో రాకపోవడం వల్లే కావచ్చు.

పాత ప్లాన్​లతో పోలిస్తే: ఇంతకు ముందు ఎయిర్​టెల్ లిస్ట్​లో ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన రూ.499 ప్లాన్ మాదిరిగానే ప్రయోజనాలను అందించే రూ.509 విలువైన ప్యాక్ ఉండేది. కానీ కంపెనీ పాత ప్లాన్​లో 6GB డేటాను కూడా అందించేది. ఇప్పుడు ఈ కొత్త ప్యాక్​లో డేటా అందించకపోవడంతో రూ.10 తగ్గించింది. అయితే పాత ప్లాన్​లో అదనంగా పాత Xstream ప్రయోజనాలు కూడా లభించేవి. ఇదిలా ఉండగా ఇప్పుడు ఎయిర్​టెల్ కస్టమర్లు పాత ప్లాన్ మాదిరిగా 6GB డేటాను పొందాలనుకుంటే ఇందుకోసం రూ.499 రీఛార్జ్​తో పాటు మళ్లీ అదనంగా రూ.121 ఖర్చు చేయాల్సి ఉంటుంది.

అదేవిధంగా కొత్త రూ.1,959 ప్లాన్ మాదిరిగానే ప్రయోజనాలను అందించేలా ఇంతకుముందు రూ.1,999 విలువైన ప్యాక్ ఉండేది. అయితే పాత ప్లాన్​లో 24GB డేటా కూడా ఉండేది. ఇప్పుడు కొత్త ప్యాక్​లో డేటాను అందించకపోవడంతో కంపెనీ రూ.40 తగ్గించింది. అయితే ఇప్పుడు ఎయిర్‌టెల్ యూజర్లు 24GB డేటాను పొందాలంటే రెండుసార్లు రూ.161 డేటా ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే రూ.161 రీఛార్జ్​తో 12GB డేటా లభిస్తుంది. దీంతో పాత ప్యాక్ మాదిరిగా 12GB + 12GB= 24GB డేటా కోసం వినియోగదారులు రూ.161 + రూ.161= రూ.322 ఖర్చు చేయాల్సి ఉంటుంది.

అంటే కేవలం వాయిస్‌, SMSల కోసం ఎయిర్​టెల్ ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ కొత్త ప్లాన్లు డేటా అవసరం లేని వినియోగదారులకు తక్కువ ధరలో లభించనున్నాయి. అయితే డేటా కూడా కావాలనుకునేవారికి మాత్రం చాలా ఎక్స్పెన్సివ్​గా మారనున్నాయి.

ఇదిలా ఉండగా ఎయిర్​టెల్ వాయిస్‌, SMSల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ ప్లాన్​ను ట్రాయ్ నోటిస్ చేసింది. టెలికాం ఆపరేటర్లు ఏడు వర్కింగ్ డేస్​ లోగా వాటిపై రిపోర్ట్ అందిస్తారని తెలిపింది. 'ఇటీవల లాంఛ్ చేసిన వోచర్‌లను ట్రాయ్ ప్రస్తుత నియంత్రణ నిబంధనల ప్రకారం పరిశీలిస్తుంది' అని తెలిపింది.

ట్రాయ్ ఆదేశాలు: ప్రస్తుతం దాదాపు అన్ని టెలికాం కంపెనీలు వాయిస్‌, SMSలతో పాటు డేటాతో ప్లాన్‌లు అందిస్తున్నాయి. ఇంటర్నెట్ అవసరం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో రీఛార్జి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వాయిస్‌, SMSల కోసం ప్రత్యేకంగా రీఛార్జి ప్లాన్లు తీసుకురావాలని ఆయా కంపెనీలను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఆదేశించింది. ఈ క్రమంలో స్పెషల్‌ టారిఫ్‌ వోచర్లు తీసుకురావాలంటూ సూచించింది.

అదిరే ఏఐ ఫీచర్లతో గెలాక్సీ S25 అల్ట్రా- ధర కూడా 14వేలు పెరిగిందిగా!- మరి అంత రేటుకు ఇది విలువైనదేనా?

యమహాకు పోటీగా హీరో- సేమ్ పవర్, ఫీచర్లతో 'జూమ్ 160' లాంఛ్- అయితే వీటిలో బెస్ట్ ఆప్షన్ ఇదే!

కిర్రాక్ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ లాంఛ్!- ధరలు ఎలా ఉన్నాయంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.