Man Suicide Attempt in Grama Sabha in Mulugu : ఇందిరమ్మ ఇళ్లు లిస్టులో తమ పేరు రాకపోవడంతో మనస్తాపానికి చెందిన వ్యక్తి గ్రామసభలోనే ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో గురువారం ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామసభ నిర్వహించారు. అక్కడకు కొత్తూరు గ్రామానికి చెందిన నాగేశ్వర రావు గ్రామసభకు హాజరయ్యారు. అయితే ఇందిరమ్మ పథకంలో లబ్ధిదారులు పేర్లు చెక్ చేయగా నాగేశ్వర రావు కుటుంబానికి రాలేదు.
నర్సు తిట్టిందని ఉరేసుకుని మహిళా రోగి ఆత్మహత్య!
దీనిపై అక్కడ ఉన్న అధికారులను అడగ్గా అతని భార్య శాంతి అంగన్వాడి టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే వారికి 5 ఎకరాల భూమి ఉంది. అందువల్ల వారి దరఖాస్తును పక్కన పెట్టినట్లు తహశీల్దారు తెలిపారు. జాబితాలో తన పేరు లేదన్న విషయం అతనికే ముందే తెలుసు. దీనిని గ్రామసభలో అడగాలని, లేకపోతే అక్కడే ఆత్మహత్యకు పాల్పడాలని, ముందే ప్లాన్‌గా తన వెంట పురుగుల ముందు తెచ్చుకున్నాడు. ప్లాన్ ప్రకారం తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అంతే అక్కడున్నవారు ఒక్కసారిగా షాకైయ్యారు. వెంటనే అతన్ని ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మళ్లీ దరఖాస్తు సమర్పిస్తే పరిశీలించి తప్పకుండా లబ్ధి చేకూర్చుతామని అధికారులు తెలిపారు.