వరదలో చిక్కుకున్న చిన్నారులు.. అతికష్టంపై ఒడ్డుకు!
🎬 Watch Now: Feature Video
హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. అకస్మాత్తుగా వచ్చిన వరదల్లో నలుగురు చిన్నారులు చిక్కుకుపోయారు. వారిని స్థానికులు అతికష్టంపై రక్షించారు. చంబా జిల్లాలోని భట్టియాట్ ప్రాంతంలో సరదాగా నదిలో రాళ్లపై ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఎగువ నుంచి వరద పోటెత్తింది. ఆకస్మికంగా వచ్చిన వరదల్లో చిక్కుపోయిన చిన్నారులను గమనించిన స్థానికులు తాళ్ల సాయంతో క్షేమంగా ఒడ్డుకు చేర్చారు.