ETV Bharat / state

ఎదురుగా ఉన్నా కనిపించట్లే! - లైట్లు వేసినా బండి ముందుకు కదలట్లే!! - SIDDIPET DISTRICT COVERED WITH FOG

సిద్దిపేట జిల్లాలో తీవ్ర పొగ మంచు - 8 దాటినా మసకమసకగా ఉంటున్న వాతావరణం - ఎంజాయ్ చేస్తున్న ప్రకృతి ప్రేమికులు - ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

Siddipet District is Completely Covered with Fog
Siddipet District is Completely Covered with Fog (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 6, 2025, 11:37 AM IST

Siddipet District is Completely Covered with Fog : శీతాకాలం అంటే మంచు కురవడం మామూలే. అసలు ఈ కాలం మొదలైందంటేనే అందరూ వేచి చూసేది మంచు ఎప్పుడు కురుస్తుందా అని. అలాంటి పొగ మంచు లేవగానే మనని పలకరిస్తూ ఇంటిని కూడా కప్పేస్తే ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేం కదా. ఈ ప్రాంతంలో కూడా అలాగే అవుతుంది. ఉదయం లేవగానే ఎదరుగా ఎవరు నిలబడ్డారో కూడా గుర్తించలేనంత పొగ మంచు కురుస్తోంది. ఇది ప్రకృతి ప్రేమికులను ఎంత ఆనంద పరుస్తుందో, అదే సమయంలో వాహనదారులను అంత ఇబ్బంది పెడుతుంది. మరి ఏ ప్రాంతాన్ని మంచు దుప్పటిలా కప్పేసిందో చూద్దామా?

రాష్ట్రంలో గత నాలుగు రోజుల నుంచి చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోతోంది. ఉదయం వేళల్లో పొగ మంచు కప్పేస్తుంది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సిద్దిపేట జిల్లాలో పొగ మంచుతో ఉదయం వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత నాలుగు రోజులుగా పొగ మంచుతో ఉదయం సమయంలో వాకింగ్​కు వెళ్లేవారు సైతం ఇబ్బందులు పడుతున్నారు. 8 గంటల సమయం దాటినా మంచు దుప్పటి కప్పేయడంతో వాహనదారులు వాహనాలను పక్కకు నిలపాల్సిన పరిస్థితి నెలకొంది.

వాఁ ఏమన్నా వెదరా - ఆ జిల్లా వాసులను ఉదయం లేవగానే పలకరిస్తున్న పొగమంచు (ETV Bharat)

జాతీయ రహదారిపై దట్టమైన పొగ మంచు - ప్రయాణం వేళ ఈ జాగ్రత్తలు తప్పనిసరి

వైద్యుల సూచనలు : చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వృద్ధులు, చిన్న పిల్లలు బయటికి రావొద్దని వైద్యులు సూచనలు చేస్తున్నారు. అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందన్నారు. సాధ్యమైనంత వరకు ఉదయం సమయంలో బయటికి రావొద్దని వైద్యులు సూచనలు చేస్తున్నారు. చలి తీవ్రత వల్ల ఉదయం సమయంలో బయటికి రావడానికి ప్రజలు జంకుతున్నారు.

ప్రకృతి ప్రేమికులైతే ఉదయం సమయంలో మంచు కురుస్తున్న సమయంలో ఫొటోలు వీడియోలు తీసుకుంటూ తమ ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటున్నారు. ఉదయం సమయంలో ఓవైపు మంచు, మరోవైపు ఎర్రటి సూర్యుడిని సెల్​ఫోన్లలో బంధించి సోషల్​ మీడియాలో పంచుకుంటున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒకలా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. మంచు దుప్పటి కారణంగా కొన్నిచోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగిన ఘటనలూ ఉన్నాయి. ఉదయం సమయంలో వాహనదారులు కచ్చితంగా పార్కింగ్ లైట్లతో పాటు మంచు తీవ్రంగా ఉంటే వాహనాలను రోడ్డు పక్కన నిలపాలని పోలీసుల సైతం సూచనలు చేస్తున్నారు.

పొగ మంచు కురుస్తోంది - దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఈ జాగ్రత్తలు మరవొద్దు!

వచ్చే మూడు రోజుల పాటు పొగ మంచు భయం - జాగ్రత్త అంటున్న వాతావరణ శాఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.