పతంగితో పాటే గాల్లోకి ఎగిరిపోయిన చిన్నారి - Hsinchu
🎬 Watch Now: Feature Video
తైవాన్ హిన్చులో నిర్వహించిన భారీ పతంగుల కార్యక్రమంలో మూడేళ్ల బాలిక గాలిపటంతో పాటే పైకి ఎగిరింది. దాదాపు 10 మీటర్లు గాల్లోకి ఎగిరిన బాలిక సురక్షితంగానే బయటపడగలిగింది. అక్కడే ఉన్న వ్యక్తులు బాలికను కింద పడకుండా పట్టుకున్నారు. చిన్నారికి ఎలాంటి గాయాలు కాలేదు. ఘటన అనంతరం కైట్ ఫెస్టివల్‌ను అధికారులు రద్దు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.