అదృష్టవంతుడు : త్రుటిలో తప్పిన ప్రమాదం - rider
🎬 Watch Now: Feature Video
భారీ లోడ్‌తో వస్తున్న లారీ ఒక్కసారిగా మీద పడుతుంటే ఎలా ఉంటుంది.. గుండె ఆగినంత పనౌతుంది. ఇలాంటి అనుభవమే ఓ వ్యక్తికి ఎదురైంది కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలోని హోసదుర్గలో. మైసూరు నుంచి హిరూర్కు భారీ లోడ్‌తో వెళుతున్న ఓ లారీ మలుపు వద్ద అదుపు తప్పి, బోల్తా కొట్టింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనదారుడు లారీ సమీపంలోకి వచ్చాడు. ఆ లోడ్ అతని మీద పడేదే. కొద్దిలో తప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.