బోటులో నుంచి సముద్రంలో పడిన మహిళ.. అంతలోనే.. - సముద్రంలో మునిగిపోయిన మహిళ వార్తలు
🎬 Watch Now: Feature Video
Drowning woman saved by police: మహారాష్ట్ర ముంబయిలో ప్రమాదవశాత్తు సముద్రపు నీటిలో పడిపోయిన యువతిని తీర ప్రాంత పోలీసులు రక్షించారు. తాడు సాయంతో యువతిని.. బోటులోకి లాగి ఆమెను కాపాడారు. అంతకుముందు యువతి ప్రయాణిస్తున్న ఓ బోటును పెద్ద అల వచ్చి ఢీకొట్టింది. దీంతో పట్టు కోల్పోయిన ఆమె ఒక్కసారిగా నీటిలోకి పడిపోయింది. అయితే బాధితురాలు అప్పటికే లైఫ్ జాకెట్ ధరించి ఉండటం వల్ల ముప్పు తప్పింది. తీర ప్రాంత పోలీసులు సకాలంలో చేరుకొని నీటి నుంచి మహిళను రక్షించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.