Maha Kumbh Yatra IRCTC Package : ప్రయాగ్‌రాజ్‌లో కన్నుల పండువగా జరగనున్న మహా కుంభమేళాకు మీరు వెళ్లాలనుకుంటున్నారా? అదే సమయంలో కాశీ విశ్వనాథుడిని దర్శనం చేసొచ్చే విధంగా ఏదైనా టూర్ ప్యాకేజీ కోసం ఎదురు చూస్తున్నారా? జనవరి 14న మొదలై మొత్తంగా 45 రోజుల పాటు జరగనున్న ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు సికింద్రాబాద్ నుంచి వెళ్లే టూరిస్ట్‌ల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు ఎంతో ఆశగా ఎదురుచూసే ఈ యాత్ర జనవరి 17వ తేదీ, 19, 24, ఫిబ్రవరి 2,7, 14, 16, 21వ తేదీల్లో ప్రారంభమవ్వనుంది. ఈ ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన టూర్ ప్యాకేజీ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ప్రయాణం కొనసాగుతుంది ఇలా :
- మొదటి రోజు ఉదయం 9:25 గంటలకు సికింద్రాబాద్ (దానాపూర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నం: 12791) నుంచి యాత్ర మొదలవుతుంది. ఆ రాత్రంతా జర్నీ ఉంటుంది.
- రెండో రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు వారణాసి ప్రాంతానికి చేరుకుంటారు. ముందుగా బుక్ చేసిన హోటల్‌కు చేరుకుంటారు. అదే రోజు సాయంత్రం గంగ హారతిని చూస్తారు. రాత్రి భోజనం, వసతి (బస) అక్కడే.
- 3వ రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకున్నాక వారణాసిలో ప్రసిద్ధ ఆలయాలను (కాశీ విశ్వనాథ ఆలయాన్ని, బిర్లా మందిర్, కాలభైరవ్ మందిర్) సందర్శించుకోవచ్చు. సాయంత్రం షాపింగ్‌తో పాటు మీ వ్యక్తిగత పనులు చూసుకోవచ్చు. రాత్రి భోజనం, బస వారణాసిలోనే ఉంటుంది.
- 4వ రోజు బ్రేక్ ఫాస్ట్ చేశాక ప్రయాగ్‌రాజ్ బయల్దేరుతారు. మధ్యాహ్నం ప్రయాగ్‌రాజ్ శివార్లలో మిమ్మల్ని (యాత్రికుల్ని) వదిలి పెడతారు. అక్కడి నుంచి టెంట్ సిటీకి తీసుకువెళ్తారు. ఇక ‘మహాకుంభమేళా’ టెంట్ సిటీలోనే రాత్రి డిన్నర్, బస ఉంటుంది.
- 5వ రోజు ఉదయం అల్ఫాహారం చేశాక చెక్ ఔట్ చేస్తారు. మీ లగేజీని లాకర్ రూమ్‌లో ఉంచి త్రివేణి సంగమం, కుంభమేళాలో మీరు వెళ్లి పాల్గొనవచ్చు. ఇక సాయంత్రం ప్రత్యేక వెహికల్స్‌లో మిమ్మల్ని ప్రయాగ్‌రాజ్ జంక్షన్‌కు చేరవేస్తారు. ఇక అదే రోజు రాత్రి 7.45 గంటలకు సికింద్రాబాద్ (12792) ఎక్స్‌ప్రెస్ రైలును ఎక్కుతారు.
- ఆరో రోజు రాత్రి 9.30 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటారు.
ఏయే రైల్వే స్టేషన్లలో ఎక్కొచ్చంటే : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌తో పాటు కాజీపేట, మంచిర్యాల, పెద్దపల్లి, రామగుండం, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్షా, సేవాగ్రామ్, నాగ్‌పుర్ రైల్వే స్టేషన్లలో యాత్రికులు ఈ రైలును ఎక్కొచ్చు. టూర్‌ను ముగించుకున్న అనంతరం సికింద్రాబాద్‌లో దిగాల్సి ఉంటుంది. ఈ ట్రిప్ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగుతుంది.
టూర్ ప్యాకేజీ వివరాలు ఇవే : థర్డ్ ఏసీలో ఒక్కో టూరిస్ట్‌కు సింగిల్ షేరింగ్‌లో అయితే రూ.48,730, ట్విన్ షేరింగ్‌కు రూ.31,610, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.29,390 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, 5-11 ఏళ్ల చిన్నారులకు (విత్ బెడ్) రూ.22,890, విత్ అవుట్ బెడ్ అయితే రూ.14,650లుగా నిర్ణయించారు. స్లీపర్ క్లాస్‌లో సింగిల్ షేరింగ్‌కు 45,700 వేలు, ట్విన్ షేరింగ్ రూ.28,570, ట్రిపుల్ షేరింగ్ రూ.26,360 చొప్పున ఉండగా, 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ.19,860 ఉంటుంది. అదే విత్ అవుట్ బెడ్ అయితే రూ.11,620 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
ఈ విషయాలను గుర్తుంచుకోండి
- ఎంచుకున్న ప్యాకేజీ ఆధారంగా ఈ ట్రైన్ థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్ ప్రయాణం ఉంటుంది.
- ప్యాకేజీ ఆధారంగా ప్రయాణానికి ఏసీ రూంలు, స్పెషల్ షేరింగ్ వాహనాలు ఏర్పాటు చేస్తారు.
- 3 రోజులు ఉదయం టిఫిన్, రాత్రి భోజనం ఉంటుంది.
- ప్రయాణ బీమా (ఇన్సూరెన్స్) వర్తిస్తుంది.
- పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే టూరిస్ట్‌లే చెల్లించుకోవాల్సి ఉంటుంది.
- ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు, బుకింగ్ కోసం ఈ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేస్తున్నారా? - మాల్దీవులను మరిపించే టూరిస్ట్ స్పాట్ మన రాష్ట్రంలోనే
సంక్రాంతికి వెళ్లేవారికి ముఖ్య గమనిక - అందుబాటులోకి మరో 52 అదనపు రైళ్లు : దక్షిణ మధ్య రైల్వే