CCTV Video: దొంగల బీభత్సం.. మహిళ ఫోన్​ కొట్టేసి.. స్కూటీపై వేగంగా ఈడ్చుకెళ్లి.. - దిల్లీ నేర వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 17, 2021, 3:54 PM IST

Chain Snatchers in Delhi: ఓ మహిళ మొబైల్ ఫోన్​ను లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు దుండగులు. ప్రతిఘటించిన ఆమెను చాలా దూరం ఈడ్చుకెళ్లారు. ఈ క్రమంలో వేగంగా మరో వాహనాన్ని ఢీకొట్టి.. రోడ్డుపై పడేసి అక్కడి నుంచి తప్పించుకుపోయారు. గమనించిన స్థానికులు ఆమెకు ప్రథమ చికిత్స అందించారు. అదృష్టవశాత్తూ ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగింది. దిల్లీ షాలీమార్ బాగ్ ప్రాంతంలో గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల్లో ఒకరిని గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.