జేసీబీపై పెళ్లిమండపానికి వధూవరులు.. కారణమిదే.. - పెళ్లి మండపానికి వధూవరులు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14271846-thumbnail-3x2-bride-groom.jpg)
సాధారణంగా పెళ్లికూతురిని పల్లకిలోనో.. కారులోనో తీసుకొస్తారు. కానీ హిమాచల్‌ప్రదేశ్‌లో ఓ వరుడు.. వధువును జేసీబీలో తీసుకొచ్చాడు. గత రెండు రోజులుగా భారీగా కురుస్తున్న మంచుతో రోడ్లన్నీ మూసుకుపోవటమే అందుకు కారణం. సిర్మౌర్ జిల్లాలోని జాగ్వా గ్రామం నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని సైంఫర్ గ్రామానికి బరత్ వెళ్లాలి. మంచుతో మూసుకుపోయిన రోడ్డును పునరుద్ధరిచేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. చేసేదేమీ లేక జేసీబీలో సైంఫర్కు చేరుకున్నారు వధూవరులు. పెళ్లి తంతు ముగించుకుని సోమవారం ఉదయం జాగ్వాకు తిరిగి వచ్చారు.