నడిరోడ్డుపై దారుణం- యువతిపై కత్తితో దాడి - నడిరోడ్డుపై దారుణం- యువతిపై కత్తితో దాడి
🎬 Watch Now: Feature Video
కర్ణాటకలో దారుణం జరిగింది. ప్రేమను నిరాకరించిందని ఓ యువతిపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశాడో యువకుడు. హుబ్లీలో ఓ నగల దుకాణంలో పనిచేస్తున్న యువతిని.. దేశ్పాండే నగర్లోని ఆటో నడుపుతున్న ఇంతియాజ్ కొంతకాలంగా ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. తన ప్రేమను ఆ యువతి అంగీకరించలేదని ఆగ్రహించిన అతడు.. కొబ్బరి బోండాలు నరికే కత్తితో కర్కశంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆమె.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేసి, దర్యాప్తు సాగిస్తున్నారు.
Last Updated : Dec 21, 2020, 4:58 PM IST