ETV Bharat / technology

మరో రికార్డ్​కు అడుగు దూరంలో ఇస్రో- శ్రీహరికోట వేదికగా 100వ ప్రయోగానికి కౌంట్​డౌన్ స్టార్ట్ - ISRO 100TH MISSION

శ్రీహరికోట నుంచి 100వ ప్రయోగానికి సర్వం సిద్ధం!- ఈ మిషన్ ఎందుకో తెలుసా?

Collection Image
Collection Image (Photo Credit- ANI)
author img

By ETV Bharat Tech Team

Published : Jan 28, 2025, 8:03 PM IST

ISROs 100th Mission: ఎన్నో మైలురాళ్లను సాధించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పుడు మరో చారిత్రక ఘనతను సాధించేందుకు అడుగు దూరంలో ఉంది. శ్రీహరికోట వేదికగా ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100వ మిషన్​లో భాగంగా GSLV (జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్)-F15 పేరుతో రాకెట్​ను ప్రయోగించేందుకు రెడీగా ఉంది. ఈ రాకెట్ అంతరిక్షంలోకి దూసుకుపోవడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇస్రో మంగళవారం ఈ మిషన్ కౌంట్​డౌన్ స్టార్ట్ చేసింది.

ఈ మిషన్​లో భాగంగా ఇస్రో శాస్త్రవేత్తలు GSLV రాకెట్​ ద్వారా నావిగేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఈ రాకెట్ జనవరి 29, 2025న ఉదయం 6:23 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇస్రో కొత్త ఛైర్మన్‌గా వి. నారాయణన్ నియమితులైన తర్వాత జరుగుతున్న తొలి ప్రయోగం కూడా ఇదే.

జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) తన 17వ ప్రయోగంలో స్వదేశీ క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ NVS-2 నావిగేషన్ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లనుంది. 2,250 కిలోల ఈ NVS-02 ఉపగ్రహాన్ని UR శాటిలైట్ సెంటర్ అభివృద్ధి చేసింది. ఇది L1, L5, S బ్యాండ్లలో నావిగేషన్ పేలోడ్​ను కలిగి ఉంది. అంతేకాక ఇది NVS-01 మాదిరిగా అదనపు C-బ్యాండ్​లో కూడా పేలోడ్‌ను కలిగి ఉంది.

ఈ ప్రయోగం ఎందుకంటే?: శ్రీహరికోట వేదికగా ఇస్రో చేపట్టిన ఈ 100వ మిషన్ మన దేశ నావిగేషనల్ సామర్థ్యాలను పెంచడంలో సహాయపడుతుంది. ఈ శాటిలైట్ భూమి, వైమానిక, సముద్ర.. నావిగేషన్, మొబైల్ డివైజెస్​లో లొకేషన్-బేస్డ్ సర్వీసులు, ఇంటర్నెట్-ఆఫ్-థింగ్స్ (IoT) బేస్డ్ అప్లికేషన్స్, ఎమర్జెన్సీ అండ్ టైమ్ సర్వీసులను అందించేందుకు ఉపయోగపడుతుంది.

ప్రయోగ ప్రత్యక్ష ప్రసారం: ఇస్రో చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని మనం మన ఫోన్​లోనే నేరుగా చూడొచ్చు. ఈ రాకెట్ ప్రయోగాన్ని ఇస్రో తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఈ ప్రయోగం లైవ్ ఉదయం 5:50 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో శ్రీహరికోట నుంచి ఇస్రో చేపట్టిన 100వ ప్రయోగ కార్యక్రమానికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారం చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

అంతరిక్షంలో అంకురోత్పత్తి- ఆకులు తొడిగిన అలసంద- సత్తా చాటిన ఇస్రో

ఇండియాకు చెందిన శాటిలైట్​ని ప్రయోగించిన స్పేస్​ఎక్స్​- ఇస్రో ఎందుకు లాంచ్ చేయలేదు? రీజన్ ఇదే!

ఇస్రో డ్రీమ్ మిషన్​పై లేటెస్ట్ అప్డేట్- శుక్రయాన్-1 లాంచ్ ఎప్పుడో తెలుసా? - ISRO Venus Orbiter Mission

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.