A Girl Commits Suicide in Hanamkonda : హనుమకొండ జిల్లా పరిధిలోని గోపాల్‌పూర్‌లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ బాలిక తండ్రి ఏకంగా భరత్ అనే యువకుడి గొంతును కత్తితో గాయపరిచాడు. భరత్ ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. మైనర్ బాలికకు గత కొంత కాలం నుంచి ఆ యువకుడితో పరిచయం ఉంది. ఈరోజు (జనవరి 28) సాయంత్రం ఎవరూ లేని సమయంలో యువకుడు ఆ బాలిక ఇంటికి వెళ్లాడు.
మనస్తాపంతో బాలిక ఆత్మహత్య : అదే సమయంలో బాలిక తండ్రి ఇంటికి వచ్చాడు. దీంతో తండ్రి కంట్లో ఆ యువకుడు పడ్డాడు. వెంటనే కోపంతో యువకుడిని గొంతుపై కత్తితో గాయపరిచాడు. జరిగిన ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన మైనర్ బాలిక(17) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాకతీయ యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
శవాన్ని ముక్కలు చేసి హీటర్‌తో ఉడికించాడు, తరువాత స్టవ్‌పై కాల్చాడు : రాచకొండ సీపీ
ఇప్పుడే వస్తానంటూ భార్యకు చెప్పి - తెల్లారేసరికి శవమై తేలిన యువకుడు - పరువు హత్యేనా?