ETV Bharat / politics

సర్పంచ్ ఎన్నికల కోసమే రైతు భరోసా డ్రామా : కేటీఆర్ - KTR RYTHU MAHA DHARNA AT NALGONDA

నల్గొండలో బీఆర్‌ఎస్‌ రైతు మహాధర్నా- హాజరైన బీఆర్‌ఎస్‌ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌ - సర్పంచ్ ఎన్నికల కోసమే రైతు భరోసా నాటకం ఆడుతున్నారని విమర్శ

BRS Working President KTR Dharna At Nalgonda
BRS Working President KTR Dharna At Nalgonda (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 28, 2025, 7:51 PM IST

BRS Working President KTR Dharna At Nalgonda : స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోమారు ఓట్లు దండుకోవడానికే కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల పట్ల కపట ప్రేమ చూపుతోందని బీఆర్​ఎస్​ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. నల్గొండలో ఏర్పాటు చేసిన రైతు మహాధర్నాకు హాజరైన ఆయన శ్రేణుల ఘన స్వాగతానికి అబ్బురపడిపోయారు. మళ్లీ కేసీఆర్​ సీఎంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే ఎలాంటి ఉత్సాహం ఉంటుందో అలా బ్రహ్మాండమైన విజయోత్సవ ఊరేగింపులా అనిపించిందని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతుబంధుకు రామ్‌రామ్‌ అంటారని ఆనాడే చెప్పామని కేటీఆర్​ స్పష్టం చేశారు. మహా ధర్నాకు బీఆర్ఎస్ నేతలు సహా కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు.

బీఆర్​ఎస్ రైతు దీక్షకు హైకోర్టు అనుమతి - రేషన్ కార్డులపై ప్రజలు తిరగబడటం ఖాయమన్న కేటీఆర్

"సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఓట్లు రాబట్టుకోవాలి కదా అందుకే కొత్త డ్రామా చేస్తున్నారు. జనవరి 26న మొదలై, మార్చి 31 వరకు సాగుతుంది అంటున్నారు. కానీ ఏ సంవత్సరం అన్నది చెప్పలేదు. మళ్లీ ఓట్లు వేశాకా నేను చెప్పానా అంటారు. సంవత్సరం నుంచి రైతులను, పేదవాళ్లను ఇబ్బందులు పెడుతున్నారు. ఏది కావాలన్నా దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్రంలో ఎవరూ ఎలా ఉన్నారో కానీ జిరాక్స్ షాపు వాళ్లు మాత్రం మంచిగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలని రైతు భరోసా అని డ్రామా చేస్తున్నారు. ఎన్నికలు అయిపోతే రైతు భరోసా కూడా ఆగిపోతది. " - కేటీఆర్​, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు

సమస్యలపై విద్యార్థులను కలవనున్న కేటీఆర్ : గత రెండు రోజులుగా ఆందోళన చేస్తున్న మహాత్మాగాంధీ విద్యార్థులను పరామర్శించాలని కేటీఆర్ భావించారు. అయితే ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వర్సిటీ ప్రధాన గేటు ముందు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే విద్యార్థులు బయటకు రాకుండా సెక్యూరిటీ సిబ్బంది గేట్లకు తాళాలు వేశారు. విద్యార్థుల కోసం వచ్చిన కేటీఆర్​కు లోనికి వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పారు. దీంతో త్వరలో మరోసారి వచ్చి విద్యార్థులను కలుస్తానని ఆయన తెలిపారు. యూనివర్సిటీ కాలేజీలో అటెండెన్స్​ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని, హాస్టల్​లో సమస్యలు ఉన్నాయని రెండు రోజులుగా విద్యార్థులు ధర్నా చేస్తున్నారు.

సీఎం రేవంత్​ రెడ్డి అపరిచితుడులా మారాడు : కేటీఆర్

'కాంగ్రెస్ హైకమాండ్​కు తెలిసే - తెలంగాణలో దోపిడీ, మోసాలు జరుగుతున్నాయి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.