ETV Bharat / bharat

కరోనా కాలంలో అలా, నేడు ఇలా- ప్రభుత్వబడుల ప్రవేశాల్లో సీన్ రివర్స్: ASER - ASER REPORT

కరోనా కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో జోరుగా అడ్మిషన్లు- ప్రస్తుతం ప్రైవేటు బడుల్లో పెద్దసంఖ్యలో ప్రవేశాలు- అసర్ రిపోర్ట్-2024 నివేదిక విడుదల

ASER Report 2024
ASER Report 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2025, 7:26 PM IST

ASER Report 2024 : కొవిడ్ సంక్షోభం తరువాత ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు బాగా పెరిగాయి. అయితే ఇప్పుడు ఈ విషయంలో రివర్స్ ట్రెండ్ కనిపిస్తోంది. కరోనా సంక్షోభం తరువాత గవర్నమెంట్ స్కూళ్లలో 6-14 ఏళ్లలోపు పిల్లలు పెద్దసంఖ్యలో చేరారు. అయితే ఇప్పుడు ఆ స్థాయిలో అడ్మిషన్లు జరగడం లేదని పేర్కొంటూ 'యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్ రిపోర్ట్‌-2024'ను (ASER) మంగళవారం విడుదల చేసింది. ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాలు 2018 నాటి స్థితికి తగ్గిపోయాయని ఈ నివేదికలో పేర్కొన్నారు. అసర్‌ సర్వేలో భాగంగా దేశంలోని 605 గ్రామీణ జిల్లాల్లో ఉన్న 17,997 గ్రామాలకు చెందిన 6,49,491 మంది పిల్లలను సర్వే చేశారు. ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ, ఒక స్థానిక సంస్థ కలిసి ఈ సర్వేను నిర్వహించాయి.

నాడు అలా నేడు ఇలా
2018లో దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 65.6 శాతం మంది 6-14 ఏళ్లలోపు పిల్లలు ప్రవేశాలు పొందారు. కరోనా తర్వాత 2022లో ఈ వయో వర్గం నుంచి ప్రవేశాలు పొందిన విద్యార్థులు 72.9 శాతానికి పెరిగింది. 2024 సంవత్సరం నాటికి ఈ ప్రవేశాలు కాస్తా 66.8 శాతానికి తగ్గింది. అంటే 2018 నాటి స్థాయికి ప్రభుత్వ పాఠశాలల అడ్మిషన్లు చేరుతున్నాయన్న మాట. ఐదేళ్లు, అంతకంటే తక్కువ వయసులైన పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతిలోకి పొందుతున్న అడ్మిషన్లు గణనీయంగా తగ్గాయి. ఈ వయో వర్గం నుంచి 2018లో 25.6 శాతం మంది ప్రవేశాలు పొందగా, 2022లో 22.7 శాతం మంది, 2024లో 16.7 శాతం మంది పిల్లలు ప్రవేశాలు పొందారు.

ప్రైవేటు పాఠశాలల్లో పెరిగిన ప్రవేశాలు

  • కరోనా సంక్షోభ కాలంలో ప్రజల జీవితాలు ఆర్థికంగా ప్రతికూలంగా ప్రభావితమయ్యాయి. దీంతో కొవిడ్-19 సంక్షోభం తరువాత ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగాయి.
  • ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయి రికవరీ దశకు చేరుకుంది. ఈ ప్రభావంతో ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి.
  • దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో 2006 నుంచి నిలకడగా ప్రవేశాలు పెరుగుతున్నాయి.
  • ప్రైవేటు పాఠశాలల్లో 6-14 ఏళ్లలోపు పిల్లల ప్రవేశాలు 2006లో 18.7 శాతమే. ఇది 2014లో గణనీయంగా పెరిగి 30.8 శాతానికి చేరింది. 2018లో కూడా అంతే శాతంలో ప్రవేశాలు కొనసాగాయి.

పిల్లల్లో డిజిటల్ అక్షరాస్యత

  • 14-16 ఏళ్లలోపు పిల్లలకు ఉన్న డిజిటల్ అక్షరాస్యతపై సర్వేను నిర్వహించారు. దీంతో ఈ వయోవర్గంలోని పిల్లల్లో 82.2 శాతం మందికి స్మార్ట్‌ఫోన్ ఎలా వినియోగించాలో తెలిసిందని సర్వేలో తెలింది.
  • వారిలో విద్యా అవసరాల కోసం మొబైల్​ను ఉపయోగించే వారు 57 శాతం మంది.
  • సోషల్​ మీడియా, గేమ్స్ ఇతరత్రా వాటి వినియోగించే వారు 76 శాతం మంది
  • దేశవ్యాప్తంగా మూడోతరగతి, నాలుగోతరగతిలోని పిల్లల్లో పఠన నైపుణ్యం క్రమంగా పెరుగుతున్నట్లు ఈ సర్వేలో గుర్తించారు.
  • కరోనా కాలంతో పోలిస్తే ప్రస్తుతం ఉత్తర్​ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు ఆశాజనక స్థాయిలో జరుగుతున్నట్లు సర్వేలో తేలింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.