బుజ్జి ఏనుగుకు ఎంత కష్టం వచ్చిందో.... - Assam
🎬 Watch Now: Feature Video
అసోం గువహటిలో చెరువులో చిక్కుకున్న ఓ గున్న ఏనుగును జాతీయ విపత్తు స్పందన దళం, అటవీశాఖ అధికారులు రక్షించారు. తల్లితో పాటు రైల్వే ట్రాక్ దాటుతున్న తరుణంలో తప్పిపోయిన జంబో దట్టమైన గుర్రపు డెక్కతో నిండిన చెరువులోకి వెళ్లి చిక్కుకుంది. అందులోనుంచి బయటపడే పరిస్థితులు కనిపంచలేదు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కొన్ని గంటల పాటు కష్టపడి ఏనుగు పిల్లను రక్షించాయి. చెరువు నుంచి బయటపడి బతుకు జీవుడా అంటూ... తల్లిని వెతుక్కుంటూ వెళ్లిపోయింది.
Last Updated : May 11, 2019, 3:03 PM IST