పట్టపగలే బంగారం దుకాణం లూటీ - కర్ణాటక నేర వార్తలు
🎬 Watch Now: Feature Video
కర్ణాటకలో పట్టపగలే బంగారు ఆభరణాల దుకాణంలో చోరీకి పాల్పడ్డాడో దొంగ. స్థానికులంతా చూస్తుండగానే కత్తితో బెదిరించి నాగప్ప జ్యువెల్లరీ దుకాణంలోకి చొరబడ్డాడు. అందినంతవరకూ దోచుకుంటుండగానే.. అక్కడి మహిళలు అప్రమత్తమై దుండగుడిపై కుర్చీలతో దాడిచేశారు. ఇంతలో అతడు మూడు బంగారు గొలుసులతో పరారయ్యాడు. చిక్కమంగళూరు జిల్లాలోని శృంగేరిలో జరిగిన ఈ ఘటన దృశ్యాలు.. సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. వీటి ఆధారంగానే పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
Last Updated : Aug 12, 2020, 8:37 PM IST