ETV Bharat / entertainment

సెకెండాఫ్​పై 'డాకు' ఎఫెక్ట్​ - బాలకృష్ణ కెరీర్‌లో నిలిచిపోయే పాత్ర ఇది! : డైరెక్టర్ బాబీ - DAAKU MAHARAAJ PRESS MEET

డాకు మాహారాజ్ ప్రెస్ మీట్ - సిినిమా ముచ్చట్లు చెప్పిన మేకర్స్ - వారి మాటల్లోనే

Daaku Maharaaj Press Meet
Daaku Maharaaj Press Meet (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 8, 2025, 7:08 AM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబినేషన్​లో తెరకెక్కుతోన్న 'డాకు మహారాజ్‌' సంక్రాంతి కానుకగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా ఓ ప్రెస్ మీట్​ను నిర్వహించి సినిమా గురించి పలు కీలక విషయాలు చెప్పుకొచ్చారు. అందులో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, సూర్యదేవర నాగవంశీ, బాబీ హాజరై సందడి చేశారు.

ఫ్లాష్‌బ్యాక్‌లో ఆ పాత్ర ఎఫెక్ట్ చాలా ఉంది : బాబీ
బాలకృష్ణ అభిమానులకి గుర్తుండిపోయే ఓ సినిమా ఇవ్వాలనేది నిర్మాత నాగవంశీ కల. అందుకు తగ్గట్టుగానే ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు పాటిస్తూ ఈ సినిమాని రూపొందించాం. బాలకృష్ణని ఇందులో కొత్తగా చూపించే ప్రయత్నం చేశాం. ఐదు యాక్షన్‌ సీన్స్ ఉంటాయి. ప్రతి ఘట్టం కూడా అభిమానులకి ఓ ప్రత్యేకమైన అనుభూతిని పంచుతుంది. మంచి కామెడీ, ఎమోషన్స్​తో అభిమానులకే కాకుండా, ఫ్యామిలీ ఆడియెన్స్​ను మెప్పించేలా ఉంటుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే డాకు మహారాజ్‌ రోల్ సెకెండాఫ్​లో కీలకం కానుంది.

ఈ సక్సెస్​ నా బర్త్​డే గిఫ్ట్​ : ప్రగ్యా జైస్వాల్
సినిమా రిలీజయ్యే రోజూ నా బర్త్​డే. అందుకే ఈ సినిమా సక్సెస్​ నాకు ఓ పెద్ద గిఫ్ట్. ఇందులో నేను ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రని పోషించాను.

అందుకే ప్రభుత్వాన్ని అడగలేదు : నిర్మాత నాగవంశీ
కథ చెప్పకుండా పాత్రల షోరీల్‌ లాగే 'డాకు మహారాజ్‌' ట్రైలర్‌ను రిలీజ్ చేశాం. ముందుగానే బయటకి చెప్పే కథ కాదు ఇది. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహపరచదు ఈ సినిమా. బాలయ్య కెరీర్‌లో నిలిచిపోయే ఓ గొప్ప చిత్రం అవుతుంది. అనంతపురంలో ఈ నెల 9న ప్రీ రిలీజ్ వేడుకలు నిర్వహిస్తున్నాం. చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో కావల్సినన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నాం. అమెరికాలోనూ భారీస్థాయిలోనే ఈ చిత్రం విడుదల ఉంటుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్‌ ధరల గురించి పర్మీషన్ వచ్చింది. తెలంగాణలో ఇప్పుడున్న ధరలే చాలు. అందుకే మేము ప్రభుత్వాన్ని అడగలేదు.

'ఇక్క‌డ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడ‌మ్మా' - గూస్​బంప్స్ తెప్పిస్తున్న 'డాకు మహారాజ్‌' ట్రైలర్‌!

'డాకు మహారాజ్' ట్రైలర్ అప్డేట్- ఈ ఈవెంట్​ కూడా అక్కడేనట!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.