Power Grid Corporation Recruitment : ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) 25 కంపెనీ సెక్రటరీ ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించి అర్హత, వయోపరిమితి, ఎంపిక విధానం తదితర వివరాలు మీ కోసం.
అభ్యర్థులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన ముందుగా 2 ఏళ్ల కాలానికి ఎంపిక చేస్తారు. సంస్థ అవసరాలతో పాటు, అభ్యర్థి పనితీరు ఆధారంగా ప్రతిఏటా దీన్ని పొడిగించే అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ గరిష్ఠ కాలపరిమితి 5 ఏళ్లు. మొత్తం ఉద్యోగాల్లో అన్‌రిజర్వుడ్ విభాగంలో 11, ఓబీసీ (ఎన్‌సీఎల్)లకు 7 పోస్టులు, ఎస్సీలకు 3, ఎస్టీలకు 2, ఈడబ్ల్యూఎస్‌లకు 2 పోస్టులను కేటాయించారు.
అర్హతలు : ఇంటర్/తత్సమాన పరీక్ష, కంపెనీ సెక్రటరీ ప్రొఫెషనల్ కోర్సు పూర్తి చేయాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ)లో అసోసియేట్ సభ్యులైవుండాలి. ఏడాది జాబ్ ఎక్స్పీరియన్స్ తప్పనిసరి. ఎజెండా డ్రాఫ్టింగ్, మినిట్స్, అఫిషియల్ లెటర్ రాయడం, బోర్డు/ కమిటీ, జనరల్ బాడీ మీటింగ్‌లు నిర్వహించడంలో అభ్యర్థికి అనుభవం ఉండాలి. శిక్షణ, ఇంటర్న్‌షిప్ కాలాన్ని ఎక్స్‌పీరియన్స్‌గా పరిగణించరు.
వయసు : 29 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్)లకు 3 ఏళ్లు, దివ్యాంగులకు ప్రభుత్వ రూల్స్ అనుగుణంగా సడలింపులు వర్తిస్తాయి.
అప్లికేషన్ ఫీజు : 400 రూపాయలు. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ సైనికోద్యోగులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం : అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక చేయనున్నారు. దరఖాస్తులు అధిక సంఖ్యలో వస్తే స్క్రీనింగ్ టెస్ట్‌ను నిర్వహించి ఇంటర్వ్యూకు షార్ట్‌లిస్ట్ తయారుచేస్తారు. దీంట్లో అన్‌రిజర్వుడ్/ ఈడబ్ల్యూఎస్‌లు 40 శాతం, రిజర్వుడ్ కేటగిరీకి చెందినవారు 30 శాతం కనీస అర్హత మార్కులను సాధించాలి. ఇంటర్వ్యూలోనూ ఇదేవిధంగా మార్కులు సాధించాల్సి ఉంటుంది.
ఇంటర్వ్యూలో సాధించే మార్కుల ఆధారంగానే అభ్యర్థులను తుది ఎంపిక చేస్తారు. స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూలకు హిందీ లేదా ఇంగ్లీషుల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకునే అవకాశం అభ్యర్థికి ఉంటుంది. కంపెనీ సెక్రటరీ విధులకు సంబంధించిన ప్రశ్నలనే మౌఖిక పరీక్ష(ఇంటర్య్యూ) అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుభవమున్న అభ్యర్థులైతే గత సంస్థ్లో నిర్వహించిన బాధ్యతలకు సంబంధించిన ప్రశ్నలను అడిగే అవకాశముంది.
వేతన శ్రేణి : నెలకు రూ.30,000-1,20,000 వరకు ఉంటుంది. మూలవేతనానికి(బేసిక్కు) అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, పెర్క్స్, గ్రాట్యుటీ, వైద్య, ఇన్సూరెన్స్ మొదలైన సదుపాయాలు ఉంటాయి.
గమనించాల్సినవి : ప్రస్తుతం వాడుకలో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్లను దరఖాస్తులో రాయల్సి ఉంటుంది. వీటితోపాటు ప్రత్యామ్నాయ సెల్ నంబర్, ఈమెయిల్ ఐడీలను కూడా పేర్కొనాలి.
- ఒరిజినల్ సర్టిఫికెట్స్‌ను పరిశీలించిన తర్వాతే ఇంటర్వ్యూను నిర్వహస్తారు.
- ప్రభుత్వ/ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే అభ్యర్థులు ఇంటర్వ్యూ సమయంలో ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ను సమర్పించాల్సి ఉంటుంది.
- దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ: 16.01.2025
- వెబ్‌సైట్:http://www.powergrid.in
డిగ్రీ అర్హతతో SBIలో జాబ్స్ - మొదటి నెల నుంచే రూ.50 వేల జీతం! - రెండ్రోజులే ఛాన్స్
కొత్త ఏడాది 2025కి పోటీ పరీక్షల ప్రణాళిక - జాబ్ క్యాలెండర్‌తో ప్రిపేర్ అవ్వండిలా !