డ్రైనేజీలో అపస్మారక స్థితిలో మందుబాబు.. తీరా లేపి చూస్తే..! - drunker dead found alive
🎬 Watch Now: Feature Video
తమిళనాడు డిండిగుల్ జిల్లాలో పీకలదాకా తాగి.. నడవడానికి కూడా ఓపికలేని ఓ వ్యక్తి బ్రిడ్జికింద మురుగు నీటిలో పడిపోయాడు. ఆహా ఏమి సుఖం.. అనుకున్నాడో ఏమో.. అలాగే నీటిలో తేలియాడుతూ అక్కడే ఉండిపోయాడు. అది చూసిన మరో వ్యక్తి చనిపోయాడనుకుని పోలీసులకు ఫోన్ చేశాడు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది అతడిని బయటకు తీశారు. తీరా చూస్తే.. అతడు బతికే ఉన్నాడు. జిల్లాలో ఆళగువరపట్టికి చెందిన మురుగవేలుగా ఆ వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి.. ఆస్పత్రికి తరలించారు.