Rohit Sharma Pakistan Visit : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్థాన్ వెళ్లనున్నాడా? ప్రస్తుతం క్రీడా వర్గాల్లో హాట్‌టాపిక్ ఇదే. అటు టీమ్ఇండియా అభిమానుల్లోనూ ఇదే ప్రశ్మ మెదులుతోంది. అందరూ దీనిపైనే చర్చించుకుంటున్నారు. మరి క్రీడా వర్గాల్లో ఈ చర్చ ఎందుకు వచ్చింది? అసలు రోహిత్ ఎందుకు పాకిస్థాన్ వెళ్లాలి? తెలుసుకుందాం
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టోర్నీ ఏదైనా సరే అందులో పాల్గొనే జట్ల కెప్టెన్లతో, బోర్డు ఓ మెగా ఈవెంట్ నిర్వహిస్తుంటుంది. అన్ని జట్ల కెప్టెన్లు టైటిల్‌తో ఫొటోషూట్‌లో పాల్గొంటారు. ఇదే ఈవెంట్లో మీడియాతో మాట్లాడుతూ తమతమ స్ట్రాటజీల గురించి చర్చించుకుంటారు. అయితే టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే దేశంలోనే ఈ ఈవెంట్ నిర్వహించడం ఆనవాయితిగా వస్తోంది.
అయితే ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లో ఐసీసీ మెగా ఈవెంట్, కెప్టెన్ల ఫొటోషూట్ నిర్వహించే ఛాన్స్ ఉంది. టోర్నీలో పాల్గొంటున్న జట్టు కెప్టెన్‌గా రోహిత్ అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే పాకిస్థాన్‌తో ఉన్న భద్రతా కారణాల వల్ల భారత్ ఆ దేశంలో పర్యటించడమే లేదు. అలాంటిది మన కెప్టెన్ రోహిత్ ఈ ఫొటోషూట్ కోసం పాక్‌కు వెళ్తాడా? లేదా? అన్నది క్రీడా వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ఒకవేళ వెళ్తే?
ఈ ఫొటోషూట్ కోసం రోహిత్ పాకిస్థాన్ వెళ్తే మాత్రం సెన్సేషన్ అవుతుంది. ఈ టోర్నీకి కూడా వరల్డ్‌వైడ్‌గా విపరీతమైన బజ్ క్రియేట్ అవుతుంది. కానీ, రోహిత్ పాక్ వెళ్లడం అసాధ్యమే. ఆ దేశంతో దౌత్యపరంగా ఉన్న సమస్యల మధ్యలో బీసీసీఐ రోహిత్‌ను అక్కడకు పంపే సాహసం చేయదని విశ్లేషకుల మాట.
దానికి కూడా హైబ్రిడ్ వేదిక!
అయితే టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తున్నట్లే, ఫొటోషూట్‌కు కూడా అదే ఫాలో అవుతారని తెలుస్తోంది. ఈ ఈవెంట్‌ను దుబాయ్ వేదికగా నిర్వహిస్తారని సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో?
కాగా, ఈ టోర్నీ ఫిబ్రవరి 19న ప్రారంభమై, మార్చి 09న ముగుస్తుంది. భారత్ తమ మ్యాచ్‌లు హైబ్రిడ్ మోడల్ విధానంలో భాగంగా దుబాయ్ వేదికగా ఆడనుంది. ఫిబ్రవరి 23న భారత్- పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది.
టోర్నీలో భారత్ పూర్తి మ్యాచ్‌లు
- ఫిబ్రవరి 20 : భారత్ - బంగ్లాదేశ్- దుబాయ్
- ఫిబ్రవరి 23 : భారత్- పాకిస్థాన్- దుబాయ్
- మార్చి 02 : న్యూజిలాండ్ - భారత్ - దుబాయ్
❤️🔥❤️🔥 pic.twitter.com/nMVNg9P44s
— Rohit Sharma (@ImRo45) April 23, 2024
పాకిస్థాన్ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ షిఫ్ట్! PCBకు ICC గట్టి షాక్ ఇవ్వనుందా?
కోహ్లీ, రోహిత్‌కు బిగ్ షాక్! - ఛాంపియన్స్ ట్రోఫీ ఫార్మాట్లో భారీ మార్పు!