ETV Bharat / technology

షాపింగ్ ప్రియులకు గుడ్​​న్యూస్- అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​లో భారీ డిస్కౌంట్​ సేల్స్!- పోటాపోటీ ఆఫర్లు! - AMAZON AND FLIPKART SALE BEGINS

అమెజాన్, ఫ్లిప్​కార్ట్​లో ఈ ఏడాది ఫస్ట్ సేల్ స్టార్ట్- ఆఫర్లు చూస్తే ఎగిరి గంతేస్తారంతే!

Amazon and Flipkart Sale Begins
Amazon and Flipkart Sale Begins (Photo Credit- Amazon/Flipkart)
author img

By ETV Bharat Tech Team

Published : Jan 13, 2025, 6:25 PM IST

Amazon and Flipkart Sale Begins: అమెజాన్, ఫ్లిప్​కార్ట్​లో ఈ ఏడాది ఫస్ట్ సేల్ ప్రారంభమైంది. అమెజాన్ తన ప్రైమ్ యూజర్ల కోసం, ఫ్లిప్‌కార్ట్ తన ప్లస్ వినియోగదారుల కోసం ఈ సేల్​ను ఒకరోజు ముందుగానే ప్రారంభించింది. అయితే ఇప్పుడు అంటే జనవరి 13, 2025 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ రెండు కంపెనీలు తమ ఈ-షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లలో సేల్‌ను ప్రారంభించాయి. అమెజాన్​లో జరుగుతున్న ఈ సేల్​ పేరు 'అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025' కాగా, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైన సేల్ పేరు 'ఫ్లిప్‌కార్ట్ మాన్యుమెంటల్ సేల్ 2025'.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ వివరాలు: ఈ సేల్ కోసం అమెజాన్ SBI బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సేల్ ద్వారా ప్రొడక్ట్​లను కొనుగోలు చేసే SBI క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు 10% వరకు ఇన్​స్టంట్ డిస్కౌంట్ అందిస్తుంది. దీంతోపాటు ప్రైమ్ మెంబర్లు 'అమెజాన్ పే ICICI' కార్డ్ ద్వారా చెల్లింపుపై 5% తగ్గింపు పొందుతారు. ఇక నాన్-ప్రైమ్ మెంబర్లకు కంపెనీ 3% డిస్కౌంట్ అందిస్తుంది.

అంతేకాక ఈ సేల్​లో అమెజాన్ పే లేటర్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా వినియోగదారులు రూ. 60,000 వరకు వస్తువులను కొనుగోలు చేసి తర్వాత చెల్లించొచ్చు. అయితే ఈ ఆఫర్ పొందాలంటే అమెజాన్​లో కొన్ని నిబంధనలు, షరతులు ఉండొచ్చు. వీటన్నింటితో పాటు ఈ సేల్​లో కస్టమర్లు నో కాస్ట్ EMI సౌకర్యాన్ని కూడా పొందొచ్చు. ఇది కాకుండా అమెజాన్​లో నడుస్తున్న ఈ సేల్‌లో వినియోగదారులు కేవలం 99 రూపాయల స్టార్టింగ్ ప్రైస్ నుంచే ఉత్పత్తులను కొనుగోలు చేయొచ్చు.

అమెజాన్ సేల్ నుంచి ఎక్కువ ప్రయోజనం పొందడం ఎలా?:

  • అమెజాన్​లో షాపింగ్ చేసే సమయంలో ఎక్కువ బ్యాంక్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్న ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులను ఉపయోగించండి.
  • మీరు అమెజాన్ ప్రైమ్ సభ్యులైతే, ప్రైమ్ అవర్స్ సమయంలో మాత్రమే షాపింగ్ చేయండి. ఎందుకంటే ఆ సమయంలో మీరు ఉత్తమ డీల్స్ పొందొచ్చు.
  • ఇది కాకుండా ICICI బ్యాంక్ కార్డ్ లేదా ఇతర కార్డుల నుంచి అన్ని ఆఫర్లు, డిస్కౌంట్లతో వాటి ధర ఎంత ఉందో కంపార్ చేయండి. అప్పుడు ఎందులో తక్కువ ధరకు లభిస్తున్నాయో చూసి కొనుగోలు చేయండి.

ఫ్లిప్​కార్ట్ సేల్ డిటెయిల్స్: అమెజాన్ లాగే ఫ్లిప్‌కార్ట్ కూడా తన ప్లాట్‌ఫామ్‌లో సేల్​ను ప్రారంభించింది. ఈ సేల్ సమయంలో మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి చెల్లింపు చేస్తే మీకు 10% ఇన్​స్టంట్ డిస్కౌంట్, EMI ట్రాన్సాక్షన్ సౌకర్యం లభిస్తుంది. ఇది కాకుండా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో చెల్లించి కొనుగోలు చేస్తే మీరు 5% అన్​లిమిటెడ్ క్యాష్‌బ్యాక్, రూ. 1000 గిఫ్ట్ వోచర్‌ను కూడా పొందొచ్చు.

దీంతోపాటు కొన్ని ఎంపిక చేసిన మేజర్ బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కూడా EMI ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ సమయంలో విప్లవాత్మక డీల్స్ అందుబాటులో ఉంటాయి. ఇవి సేల్ జరిగే ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు అందుబాటులో ఉంటాయి. ఈ సమయంలో ప్రొడక్ట్​లు కేవలం 76 రూపాయల నుంచే లభిస్తాయి. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రష్ అవర్ డీల్స్ ఎర్లీ మార్నింగ్ 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి. ఈ సమయంలో మీరు షాపింగ్ చేస్తే భారీ డిస్కౌంట్ ఆఫర్లను పొందొచ్చు.

ఫ్లిప్‌కార్ట్ సేల్​ను ఎప్పుడు సద్వినియోగం చేసుకోవాలి?:

  • ఏదైనా వస్తువు కొనడానికి ముందు దాని గురించి రీసెర్చ్ చేయండి. విష్ లిస్ట్ తయారు చేసుకోండి. ఆ ప్రొడక్ట్​పై పర్టిక్యులర్ సమయంలో ఏదైనా స్పెషల్ డిస్కౌంట్ వస్తుందో లేదో చూడండి.
  • ఫ్లిప్​కార్ట్​లో షాపింక్ చేసే సమయంలో HDFC, Axis బ్యాంక్ కార్డుల ద్వారా చెల్లింపులు చేయండి. తద్వారా మీరు ఎక్కువ ప్రయోజనాన్ని పొందొచ్చు.
  • ఒకవేళ మీరు ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులైతే ఈ సేల్​లో మరిన్ని అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ రెండర్స్ లీక్- ఒక్కో మోడల్ స్పెక్స్ వివరాలు ఇవే!

ఐఓఎస్ డివైజ్​ యూజర్లకు అదిరే అప్​డేట్- గ్రోక్ ఏఐ కోసం అందుబాటులోకి సొంత యాప్!

వావ్ స్పోర్టివ్ డిజైన్​లో కొత్త పల్సర్ భలే ఉందిగా!- ఫీచర్స్, పెర్ఫార్మెన్స్​లో కూడా సూపరంతే!

చౌకైన రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా?- రూ.200లోపు ధరలో బెస్ట్ ఇవే!

స్టన్నింగ్ లుక్​లో హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ వచ్చేసిందోచ్!- ధర ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.