ETV Bharat / sports

భారత్ x పాక్ పోరుపై డాక్యుమెంటరీ- ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందే స్ట్రీమింగ్ - INDIA VS PAKISTAN DOCUMENTARY

నెట్​ఫ్లిక్స్​లో భారత్ - పాకిస్థాన్ డాక్యుమెంటరీ- రిలీజ్ ఎప్పుడంటే?

India vs Pakistan Documentary
India vs Pakistan Documentary (Source : Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 13, 2025, 5:22 PM IST

India vs Pakistan Documentary : క్రికెట్‌లో చిరకాల ప్రత్యర్థులు అనగానే అందరికీ గుర్తుకొచ్చేది భారత్, పాకిస్థాన్ జట్లే. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే చాలు క్రికెట్ అభిమానులు టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతారు. మైదానంలో జరుగుతోంది మ్యాచా? లేక యుద్ధమా? అనే రితీలో విజయం కోసం పోరాటం సాగుతుంది. ఇరు జట్ల ఆటగాళ్లు విజయం కోసం తీవ్రంగా పరితపిస్తారు. ట్రోఫీ కంటే ఈ మ్యాచ్​​లో నెగ్గడమే తమ లక్ష్యం అన్నట్లుగా తలపడతాయి. ఇలా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే భారత్- పాక్​ మధ్య చరిత్రాత్మక పోరును ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ నెట్​ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ రూపొందించింది. ​

భారత్- పాక్ క్రికెట్​కు సంబంధించి ఈ డాక్యుమెంటరీని ఫిబ్రవరి 7న రిలీజ్ చేయనున్నట్లు నెట్​ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఇన్​స్టాగ్రామ్​లో ఓ పోస్టర్ విడుదల చేసింది. 'ది గ్రేటెస్ట్ రైవల్రీ : ఇండియా వర్సెస్ పాకిస్థాన్' పేరుతో ఇది స్ట్రీమింగ్ కానున్నట్లు పేర్కొంది.

'రెండు దేశాలు. ఒక అద్భుతమైన పోటీ. 160 కోట్ల మంది ప్రజల ప్రార్థనలు. ది గ్రేటెస్ట్ రైవల్రీ : ఇండియా వర్సెస్ పాకిస్థాన్. మరెక్కడా, ఎప్పుడూ ఇవ్వనంత ఓ గొప్ప థ్రిల్లింగ్ మ్యాచ్ ఫ్రిబ్రవరి 7న నెట్​ఫ్లిక్స్​లో ఆస్వాదించండి' అంటూ ఇన్​స్టాగ్రామ్ పోస్ట్​కు క్యాప్షన్ రాసుకొచ్చింది.

ఇరుదేశాల దిగ్గజాలు
కాగా, ఈ నెట్​ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో భారత్, పాకిస్థాన్ జట్లకు చెందిన దిగ్గజ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, సౌరభ్ గంగూలీ, షోయబ్ అక్తర్, వకార్ యూనిస్, అశ్విన్, జావెద్ మియాందాద్, ఇంజిమామ్ ఉల్ హక్ సహా పలువురు ప్లేయర్స్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ డాక్యుమెంటరీని దర్శకుడు చంద్రదేవ్ భగత్ స్టీవర్ట్ సుగ్ తెరకెక్కించారు. గ్రే మేటర్ ఎంటర్‌ టైన్‌ మెంట్ నిర్మించింది. పాయల్ మాధుర్ భగత్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్​గా వ్యవహరించారు.

యాషెస్ కంటే పెద్ద సిరీస్
ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య మ్యాచ్​ను యాషెస్ సిరీస్ కంటే పెద్దదిగా అభివర్ణిస్తుంటారు క్రీడా విశ్లేషకులు. ఇరుదేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే అదో యుద్ధంలా ఉంటుంది. ఇరు దేశాల అభిమానుల మధ్య భావోద్వేగాలు తారాస్థాయిలో ఉంటాయి. దాయాదుల మధ్య పోరు క్రికెట్ మైదానంలో ఓ యుద్ధాన్ని తలపిస్తుంది.

భారత్, పాక్ మ్యాచ్​కు అంతా రెడీ - హెడ్ టు హెడ్ రికార్డ్స్​ ఇవే - మ్యాచ్​​ ఎందులో చూడాలంటే?

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ రిలీజ్- భారత్ x పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.