ఫ్రూట్స్ అమ్మడంలో ఈ 'బనానా డాన్సర్' రూటే సెపరేటు! - వైరల్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Banana Seller Viral Dance Video: మహారాష్ట్ర పుణెలో ఓ అరటి పండ్ల వ్యాపారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. రోడ్డుపై నృత్యం చేస్తూ పండ్లు విక్రయిస్తున్నాడు. మెడలో ప్రైస్ ట్యాగ్ ధరించి, చేతులు, తలపై అరటి గెలలు మోస్తూ పండ్లు కొనాలని బాటసారులను అడుగుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కరోనా మొదటి దశలో ఉద్యోగం కోల్పోయిన అనంతరం అరటి పండ్ల వ్యాపారంలోకి అడుగు పెట్టాడు నామ్దేవ్ మానే. ఈ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతని డాన్స్ చూసి స్థానికులు కూడా పండ్లు కొనేందుకు ముందుకువస్తున్నారు. దీంతో అనతికాలంలో నామ్దేవ్ ఫేమస్ అయ్యాడు.