న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్స్ బిల్‌బోర్డ్‌పై రామమందిర నమూనా - latest ram bhumi pujan
🎬 Watch Now: Feature Video
అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డ్‌పై అయోధ్య రామమందిర నమూనా చిత్రాన్ని ప్రదర్శించారు. టైమ్స్ స్క్వేర్ ప్రాంగణంలో జై శ్రీరామ్ నినాదం మార్మోగింది. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డు ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ తెరల్లో ఒకటి. అయోధ్యలో బుధవారం రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేసిన సందర్భంగా.. చారిత్రక ఘట్టానికి ప్రతీకగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. భూమిపూజ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ సహా పరిమిత సంఖ్యలో ప్రముఖులు పాల్గొన్నారు.
Last Updated : Aug 5, 2020, 9:23 PM IST