మ్యాన్‌హోల్‌లో పడిపోయిన వ్యక్తి.. ఆ తర్వాత? - తెరిచి ఉంచిన మ్యాన్‌హోల్‌లో పడిన బాటసారి
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్ర పుణెలో తెరిచి ఉంచిన మ్యాన్‌హోల్‌లో పడిపోయిన వ్యక్తిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఒక వ్యక్తి రోడ్డుపైన నడుస్తూ మ్యాన్‌హోల్ తెరిచిఉందనే విషయం గమనించకుండా అందులో పడిపోయాడు. అది చూసిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తాళ్ల సాయంతో అతడిని బయటకు తీశారు. క్షేమంగా బయటపడిన ఆ వ్యక్తి భావోద్వేగానికి గురై అక్కడే చాలా సేపు కూర్చుండిపోయాడు. అతడికి పెద్ద గాయాలేమీకాలేదని అధికారులు తెలిపారు.