గంగా తీరంలో వలస పక్షుల సందడి
🎬 Watch Now: Feature Video
Siberian Birds In Up Prayagraj: ఉత్తర్‌ప్రదేశ్‌లోని గంగా తీరాన సైబీరియా వలస పక్షులు సందడి చేస్తున్నాయి. ప్రయాగ్‌రాజ్ చుట్టుపక్కల ప్రాంతాలు, సంగం తీరానికి వలస పక్షులు భారీగా తరలివచ్చాయి. పక్షుల కిలకిలరావాలతో ఆ ప్రాంతమంతా ఆకర్షణీయంగా మారింది. వీటిని చూసేందుకు పర్యటకులు భారీగా తరలివస్తున్నారు. ప్రతి ఏడాది నవంబర్ మాసంలో సైబీరియా నుంచి గంగా తీరానికి పెద్ద ఎత్తున పక్షులు తరలివచ్చేవి. కానీ ఈ సారి ఫిబ్రవరిలోనే పక్షులు వచ్చాయి.
Last Updated : Feb 3, 2023, 8:11 PM IST