ETV Bharat / sports

10 ఏళ్లు వెయిట్ చేసిన అభిమాని - రోహిత్ శర్మ ఏం చేశాడంటే?

రోహిత్ అభిమాని పదేళ్ల నిరీక్షణకు తెర- ఫ్యాన్స్​కు ఖుషీ చేసిన హిట్​మ్యాన్!

Rohit Sharma Autograph
Rohit Sharma Autograph (Source : Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : 3 hours ago

Rohit Sharma Autograph : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. హిట్​మ్యాన్ బయట ఎక్కడ కనిపించినా అభిమానులు అతడిని చుట్టు ముట్టేస్తారు. సెల్ఫీలు, ఆటోగ్రాఫ్​లు తీసుకొని తెగ మురిసిపోతుంటారు. తాజాగా రోహిత్ అభిమానికి ఫ్యాన్ మూమెంట్ ఎదురైంది. తాను 10ఏళ్లుగా ఈ సందర్భం కోసం ఎదురు చూస్తున్నానంటూ సంతోషం వ్యక్తం చేశాడు. మరి అదేంటంటే?

కెప్టెన్ రోహిత్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. డిసెంబర్ 6న ఆస్ట్రేలియాతో డై/నైట్ టెస్టు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టీమ్ఇండియా- ఆసీస్ ప్రైమ్​మినిస్టర్స్ 11తో ఆదివారం ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. కాన్​బెర్రా వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో భారత్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. అయితే మ్యాచ్ అనంతరం రోహిత్ డ్రెస్సింగ్​ రూమ్​కు వెళ్తుండగా ఫ్యాన్స్​ కోరిక మేరకు వాళ్లకు ఆటోగ్రాఫ్స్ ఇచ్చాడు.

ఫ్యాన్స్​ అందరూ 'రోహిత్ రోహిత్ ' అంటూ కేరింతలు కొడుతుండగా హిట్​మ్యాన్ టీ షర్ట్స్, మినీ బ్యాట్స్​పై ఆటోగ్రాఫ్ చేశాడు. ఈ సమయంలో ఓ అభిమాని ఈ ఆటోగ్రాఫ్​ కోసం పదేళ్లుగా ఎదురుచూస్తున్ననని చెప్పాడు. 'రోహిత్ భాయ్, ముంబయి కా రాజా పదేళ్లు అవుతుంది భయ్యా' అని ఆటోగ్రాఫ్​ ఉద్దేశిస్తూ అన్నాడు. దీంతో హిట్​మ్యాన్​ కూడా ఒక్కసారిగా నవ్వుకున్నాడు. కాగా, ఈ వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియా అకౌంట్​లో షేర్ చేసింది. దీంతో 'రోహిత్ మంచి మనసున్న వ్యక్తి' అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, రోహిత్ ప్రస్తుతం బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి సిద్ధం అవుతున్నాడు. ఇటీవల తన భార్య రితిక డెలివరీ ఉండడం వల్ల హిట్​మ్యాన్​ ఈ సిరీస్​లో తొలి టెస్టుకు దూరమయ్యాడు. రీసెంట్​గా జట్టుతో కలిసిన రోహిత్ ఆదివారం ప్రైమ్ మినిస్టర్స్​ 11 జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్​లో వన్​ డౌన్​లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ 11 బంతుల్లో కేవలం 3 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఇక రెండో టెస్టులోనై అతడు రాణించి భారీ స్కోర్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇరుజట్ల మధ్య డిసెంబర్ 6న పింక్ బాల్ టెస్టు ప్రారంభం కానుంది.

పార్లమెంట్​లో రోహిత్ అదిరే స్పీచ్- కెప్టెన్​ శ్వాగ్ వీడియో చూశారా?

ఆస్ట్రేలియాకు పయనమైన హిట్​మ్యాన్ - 'ఆల్​ ద బెస్ట్' చెప్పి ఫ్లైటెక్కించిన సతీమణి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.