ETV Bharat / offbeat

మళ్లీ మళ్లీ తినాలనిపించే నార్త్​ ఇండియా రెసిపీ - "దహీ ఆలూ కర్రీ"ని ఇలా ప్రిపేర్ చేయండి!

-బంగాళాదుంపలతో అద్దిరిపోయే కర్రీ -ఇంట్లో వాళ్లు ఇష్టంగా లాగిస్తారు

How to Make Dahi Aloo Recipe
How to Make Dahi Aloo Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

How to Make Dahi Aloo Recipe : మనలో చాలా మంది ఇంట్లో ఆలూ గడ్డలుంటే వాటితో ఫ్రై, లేదా టమాటాలు వేసి కర్రీ చేసేస్తుంటారు. ఎప్పుడూ ఒకేలా చేస్తే ఇంట్లో వాళ్లందరూ.. మళ్లీ ఆలూ కర్రీనే వండావా.. అని ముఖం తిప్పేస్తుంటారు. అయితే.. ఈ సారి కాస్త కొత్తగా పొటాటోతో నార్త్​ ఇండియా స్టైల్లో "దహీ ఆలూ కర్రీ" ప్రిపేర్​ చేయండి. ఈ స్టోరీలో చెప్పిన విధంగా చేస్తే కర్రీ అన్నం, చపాతీల్లోకి రుచి అద్దిరిపోతుంది. ఇది చేయడానికి ఎక్కువ టైమ్ కూడా పట్టదు. సింపుల్​గా ఇంట్లో ఉండే పదార్థాలతోనే చేసేసుకోవచ్చు. మరి ఇక ఆలస్యం చేయకుండా టేస్టీ దహీ ఆలూ కర్రీ ఎలా చేయాలో ఓ లుక్కేయండి..

కావాల్సిన పదార్థాలు :

  • చిన్న బంగాళాదుంపలు-350 గ్రాములు
  • రెండు చిటికెళ్ల ఇంగువ
  • మిరియాలపొడి- 2 టీస్పూన్లు
  • జీలకర్ర- అరటీస్పూన్
  • ఉప్పు రుచికి సరిపడా
  • కలోంజి (ఉల్లి గింజలు)-రెండు చిటికెళ్లు
  • ఉల్లిపాయ-1
  • టమాటాలు-2
  • అల్లం వెల్లుల్లి పేస్ట్-టేబుల్​స్పూన్
  • ధనియాలపొడి-టీస్పూన్
  • వేయించిన జీలకర్ర పొడి-టీస్పూన్
  • గరం మసాలా- అరటీస్పూన్
  • కొత్తిమీర తరుగు
  • పెరుగు-300 గ్రాములు

తయారీ విధానం..

  • ముందుగా బంగాళదుంపలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెను స్టౌపై పెట్టి 2 గ్లాసుల నీళ్లు పోసి బంగాళదుంపలను 80 శాతం ఉడికించుకోవాలి.
  • ఈ కర్రీలోకి ఆలుగడ్డలను పూర్తిగా మెత్తగా కుక్ చేసుకోకూడదు. మీరు చిన్న బంగాళదుంపలకు బదులుగా.. పెద్ద ఆలూని 4 ముక్కలుగా కట్​ చేసుకుని కూడా వండుకోవచ్చు
  • తర్వాత వాటిని ఒక ఒక ప్లేట్లోకి వేసుకుని పొట్టు తీసేసుకోవాలి.
  • అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలను సన్నగా కట్​ చేసుకోండి. ఒక మిక్సీ జార్లోకి టమాటా ముక్కలను తీసుకుని మెత్తగా పేస్ట్​ చేసుకోండి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టండి. ఇందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయండి. ఆపై పొట్టు తీసుకున్న బంగాళదుంపలు వేసి ఫ్రై చేసుకోండి.
  • బంగాళదుంపలపై గోల్డెన్​ కలర్​ రాగానే ఇంగువ, ఉప్పు, కొద్దిగా మిరియాలపొడి వేసి బాగా కలపండి. ఒక రెండు నిమిషాల తర్వాత ఆలూని ఒక ప్లేట్లోకి తీసుకోండి.
  • ఇప్పుడు అదే పాన్​లో కొద్దిగా ఆయిల్​ వేసి వేడి చేయండి. ఆపై జీలకర్ర, కలోంజి గింజలు వేసుకోండి. ఆపై ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి.
  • ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్​, ఉప్పు, ధనియాలపొడి, వేయించిన జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, కొద్దిగా మిరియాలపొడి, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేయండి.
  • 2 నిమిషాల తర్వాత టమాటా పేస్ట్​ వేసి కలపండి. నూనె పైకి తేలిన తర్వాత వేపుకున్న ఆలూ వేసి కలపండి.
  • ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి అలా వదిలేయండి. తర్వాత స్టౌ ఆఫ్​ చేసి చిలికిన పెరుగు వేసుకుని మిక్స్​ చేయండి.
  • కూరలో పెరుగు బాగా కలిసిన తర్వాత స్టౌ ఆన్​ చేసి.. నూనె పైకి తేలెంత వరకు మూత పెట్టి ఉడికించుకోండి.
  • ఆపై కర్రీలోకి కాస్త కొత్తిమీర తరుగు చల్లుకుని స్టౌ ఆఫ్​ చేసుకుంటే సరిపోతుంది.
  • అంతే ఘుమఘుమలాడే కమ్మటి దహీ అలూ కర్రీ మీ ముందుంటుంది.
  • నచ్చితే ఇలా ఓ సారి ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

దాబా​ స్టైల్​ "ఆలూ భునా మసాలా" - ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!

అన్నం, టిఫెన్స్​లోకి సూపర్ కాంబినేషన్ - ఘుమఘుమలాడే "హరియాలీ దమ్ ఆలూ" - నెవ్వర్ బిఫోర్ టేస్ట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.