Harshit Rana Substitute Controversy : ఇంగ్లాండ్‌తో నాలుగో టీ20లో టీమ్ఇండియా బౌలర్ హర్షిత్ రాణా కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా రావడం క్రికెట్ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసింది. శివమ్ దూబే స్థానంలో హార్షిత్ బరిలోకి దిగడం సరైంది కదని ఇంగ్లాండ్ వాదించింది. తాజాగా దీనిపై టీమ్ఇండియా కోచ్ మోర్నీ మోర్కెల్ క్లారిటీ ఇచ్చాడు. ఈ విషయంలో తమకున్న అవకాశాలను వినియోగించుకున్నట్లు మోర్నీ మోర్కెల్ వెల్లడించాడు.
'శివమ్ దూబె బ్యాటింగ్ చేస్తుండగా బంతి హెల్మెట్‌కు బలంగా తాకింది. ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలోనే కాస్త తలనొప్పి లక్షణాలు మొదలైనట్లు తెలిపాడు. దీంతో అతడికి బదులు మరొకరి పేరును మ్యాచ్ రిఫరీకి సూచించాం. దూబెకు సబ్‌స్టిట్యూట్‌గా వచ్చే ఆటగాడి పేరును ఇచ్చాం. ఆ తర్వాత రిఫరీ నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో హర్షిత్ డిన్నర్ చేస్తున్నాడు'
'అతడు చాలా వేగంగా సిద్ధమై ఫీల్డింగ్‌కు వెళ్లాడు. మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయితే ఇక్కడ ఎవరినైనా ఆడించే అధికారం మాకు లేదు. రిఫరీకి సబ్‌స్టిట్యూట్ పేరును ఇవ్వడం వరకే మా పని. దీనిపై తుది నిర్ణయం మ్యాచ్ రిఫరీదే ఉంటుంది. అది మా చేతుల్లో ఉండదు. రిఫరీ నుంచి అనుమతి రావడం వల్ల ఆ ఛాన్స్ మేం ఉపయోగించుకున్నాం' అని మోర్కెల్ స్పష్టం చేశాడు.
ఇదీ జరిగింది
నాలుగో టీ20కి మొదట ప్రకటించిన తుది జట్టులో హర్షిత్ లేడు. భారత్ ఇన్నింగ్స్‌లో శివమ్ దూబె బ్యాటింగ్ చేస్తుండగా కంకషన్‌కు గురయ్యాడు. దీంతో అతడి స్థానంలో హర్షిత్ రాణాను సబ్‌స్టిట్యూట్‌గా ఎంచుకున్నాడు. అలా బరిలో దిగిన హార్షిత్ మూడు వికెట్లు పడగొట్టి, విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఆల్‌రౌండర్ స్థానంలో ఫుల్‌టైమ్ బౌలర్ హర్షిత్ సబ్‌స్టిట్యూట్‌గా రావడం కాంట్రవర్సీ అయ్యింది.
ఐసీసీ రూల్స్ ఎలా ఉన్నాయి?
కంకషన్ సబ్‌స్టిట్యూట్ రూల్స్ ప్రకారం ఒకరికి బదులు మరొకరిని ఆడేందుకు మాత్రమే అనుమతించొచ్చు. అయితే, బ్యాటర్ స్థానంలో బ్యాటర్ లేకుంటే బౌలర్ స్థానంలో బౌలర్ లేదా ఆల్‌రౌండర్ స్థానంలో ఆల్‌రౌండర్‌కు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఏదైనా జట్టు కోరిక మేరకు ఐసీసీ రిఫరీ ఈ రీప్లేస్‌మెంట్‌కు అనుమతించాల్సి ఉంటుంది. అతడిదే తుది నిర్ణయం కూడా అవుతుంది. అయితే దీనిపై ప్రత్యర్థి జట్టుకు అప్పీలు చేసేందుకు ఏ మాత్రం హక్కు ఉండదు.
Comes on as concussion substitute...
— BCCI (@BCCI) January 31, 2025
... and strikes soon after he's given the ball
Harshit Rana gives #TeamIndia their 4th success with the ball!
Follow The Match ▶️ https://t.co/pUkyQwxOA3 #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/037UYPshs2
టీ20 మ్యాచ్‌లో హర్షిత్ కాంట్రవర్సీయల్ డెబ్యూ! - ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే?