ETV Bharat / offbeat

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా 'మొక్కలు' వాడిపోతున్నాయా? - ఈ టిప్స్​ పాటిస్తే మంచి ఫలితాలు! - TIPS TO REJUVENATE WITHERED PLANTS

-పలు కారణాల వల్ల వాడిపోతున్న మొక్కలు -ఈ టిప్స్ పాటించారంటే తిరిగి జీవం పోయొచ్చట!

Tips to Rejuvenate the Withered Plants
Tips to Rejuvenate the Withered Plants (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 1, 2025, 3:05 PM IST

Tips to Rejuvenate the Withered Plants: గార్డెనింగ్‌ ఇప్పుడిది చాలా మందికి అలవాటుగా మారిపోయింది. మనసు ప్రశాంతంగా ఉండటానికి, ఇంటి అవసరాల కోసం చాలా మంది త‌మ ఇళ్లలో ర‌క‌ర‌కాల మొక్క‌ల‌ను పెంచుతుంటారు. అయితే మనం రోజుల తరబడి ఇంట్లో లేకపోవడం లేదంటే సమయం దొరక్కపోవడం వంటి కారణాల వల్ల వాటి సంరక్షణ విషయంలో శ్రద్ధ చూపించకపోవచ్చు. దీంతో ఎంతో ఇష్టపడి పెంచుకుంటున్న మొక్కలు వాడిపోతుంటాయి. అయితే అలాంటి వాటికి తిరిగి జీవం పోయాలంటే కొన్ని ఇంటి చిట్కాలు మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అరటి పండు తొక్కలు: వాడిపోయిన మొక్కల్ని తాజాగా చేయడంలో అరటి పండు తొక్కలూ దోహదం చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం బనానా తొక్కల్ని చిన్న చిన్న ముక్కలు చేసి ఒక గ్లాస్‌ జార్‌లో వేసి అందులో లీటరు నీటిని నింపి రాత్రంతా అలాగే వదిలేయాలి. ఉదయాన్నే నీటిని వడకట్టి స్ప్రే బాటిల్‌లో నింపుకోవాలి. ఈ నీటిని రోజుకోసారి లేదా రెండుసార్లు చొప్పున మొక్కలు, వాటి మొదళ్లపై స్ప్రే చేస్తే సత్ఫలితాలుంటాయని చెబుతున్నాపు. వీటిలోని పొటాషియం మొక్కల్ని తిరిగి పునరుత్తేజితం చేయడంలో సహకరిస్తుంది

బియ్యం కడిగిన నీళ్లు: రైస్​ వాష్​ చేసిన నీళ్లతో అందాన్ని సంరక్షించుకోవచ్చన్న సంగతి చాలా మందికి తెలిసిందే. అయితే ఇవే నీటితో వాడిపోయిన మొక్కల్నీ తిరిగి పునరుత్తేజితం చేయచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే బియ్యం కడిగిన నీటిని ఒక స్ప్రే బాటిల్‌లో నింపుకొని, రోజుకోసారి మొక్కలపై, వాటి మొదళ్లపై స్ప్రే చేయాలంటున్నారు. ఈ నీటిలో ఉండే స్టార్చ్‌ మొక్కలకు దివ్యౌషధంలా పనిచేసి వాటికి తిరిగి జీవం పోస్తుందని చెబుతున్నారు.

పంచదార: షుగర్​ కూడా మొక్కలకు మంచిదంటున్నారు. కొన్ని నీళ్లలో టేబుల్‌ స్పూన్‌ చక్కెర కలిపి ఒక స్ప్రే బాటిల్‌లో పోసుకోవాలి. ఆ నీటిని మొక్కల ఆకులపై కొద్దిగా స్ప్రే చేయాలి. అయితే ఈ నీటిని మొక్కల మొదళ్లపై స్ప్రే చేయకూడదట. ఎందుకంటే ఆ నీటిలోని తీపి కారణంగా కీటకాలు మొక్క ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తాయట! కాబట్టి కొద్ది మోతాదులో స్ప్రే చేస్తే వాటికి తక్షణ శక్తి అందుతుందని, అవి పునరుత్తేజితమవుతాయంటున్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి:

  • మొక్కలకు తగినంత సూర్యరశ్మి అందకపోయినా వాటి ఆకులు పాలిపోయినట్లుగా తయారవుతాయని, ఈ క్రమంలోనే వాటిని సూర్యరశ్మి తగిలే చోట ఉంచాలని సూచిస్తున్నారు.
  • మొక్కల్లో వాడిపోయిన ఆకుల్ని ఎప్పటికప్పుడు తొలగించడం మంచిదని, ఫలితంగా వాటి ప్రభావం ఇతర ఆకులపై, మొక్కపై పడకుండా ఉంటుందంటున్నారు.
  • కుండీ చిన్నగా ఉండి, కొన్ని మొక్కల వేర్లు ఎక్కువగా విస్తరిస్తాయి. దీంతో వాటికి తగినంత పోషణ అందకపోవచ్చు. ఇలాంటప్పుడూ మొక్కలు వాడిపోతుంటాయి. కాబట్టి పాత కుండీని తొలగించి కొంచెం పెద్దగా ఉండే కొత్త కుండీలో మొక్కను తిరిగి నాటితే ఫలితం ఉంటుందని అంటున్నారు.
  • నీటిలో ఉండే క్లోరైడ్‌, ఫ్లోరైడ్‌ వంటివి మొక్కల ఆరోగ్యానికి ప్రతిబంధకాలుగా మారతాయంటున్నారు. కాబట్టి ప్రత్యేకించి నిల్వ చేసిన వర్షపు నీరు, క్లోరైడ్‌/ఫ్లోరైడ్‌ లేని నీటిని మాత్రమే మొక్కలకు ఉపయోగిస్తే అవి వాడిపోకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు.

మీ పుట్టిన తేదీ ప్రకారం ఈ మొక్కలు నాటితే - దరిద్రం పోయి అదృష్టం కలుగుతుందట!

మీ నిమ్మచెట్టు ఎదగడం లేదా? - ఈ టిప్స్​ పాటిస్తే కాయలు పుష్కలంగా కాస్తాయి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.