ETV Bharat / state

లైన్‌ దాటి అతిగా ప్రవర్తిస్తే జైలుకే - ఎలాగో తెలుసుకోండి - JAIL FOR VIOLATION

తల్లిదండ్రులు బాధ్యత మరిస్తే పిల్లలకే కాదు సమాజంపై ప్రతికూల ప్రభావమే - తప్పుడు పనులు చేసినా, బాధ్యతలను మరచినా ఊచలు లెక్కబెట్టాల్సిందే

CHILD MARRIAGES
JAIL FOR VIOLATION (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 1, 2025, 3:55 PM IST

Break the Law you will go To Jail : సామాజికంగా, చట్టపరంగా, నైతికంగా ఏదైనా సరే. బాధ్యత అనేది పౌరులందరికీ తప్పనిసరి. అది విస్మరిస్తే చాలా ప్రమాదం. తల్లిదండ్రులు బాధ్యత మరిస్తే పిల్లలకే కాదు సమాజంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. చెడు పనులు చేసినా, అందుకు ప్రోత్సహించినా ఊచలు లెక్కపెట్టాల్సిందే.

MOTOR VEHICLE ACT
Minors driving vehicles (ETV Bharat)

పిల్లలకు వాహనాలు ఇస్తే : మోటారు వాహన చట్టం ప్రకారం 18 ఏళ్ల వయస్సు నిండిన తర్వాత డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందిన వారు మాత్రమే వాహనాలు నడపాలి. ఇలా కాకుండా మైనర్లు బండి నడుపుతూ పట్టుబడితే రూ. 500 నుంచి రూ. 5 వేల వరకు ఫైన్ విధించే అవకాశం ఉంటుంది. పిల్లలు వాహనం నడుపుతున్న క్రమంలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే మైనర్‌తోపాటు తల్లిదండ్రులు, వాహన యాజమానిపై పోలీసులు కేసు నమోదు చేస్తారు. చట్ట ప్రకారం వీరికి పదేళ్ల జైలుశిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది.

10 YEARS JAIL
CHILD MARRIAGES (ETV Bharat)

బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించినా : యువతుల వివాహానికి చట్టబద్ధమైన వయసు పద్దెనిమిదేళ్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ ఆ గడువుకు ముందు పెళ్లి చేస్తే దానిని బాల్య వివాహంగా పరిగిణిస్తారు. చట్ట ప్రకారం ఇది నేరం. ఆ బాలికను వివాహం చేసుకుంటే యువకుడికి శిక్ష పడుతుంది. ఇలాంటి వివాహాలను ప్రోత్సహించే వారు, పెళ్లి జరిపించే పురోహితుడు, హాజరైన వారిని సైతం శిక్షించే అవకాశం లేకపోలేదు. బాల్య వివాహం జరుగుతున్నట్లు ఎవరికైనా తెలిస్తే 1098 నంబరుకు ఫోన్‌చేసి ఛైల్డ్‌లైన్‌కు సమాచారం ఇవ్వవచ్చు. వారు స్పందించి ఆ వివాహాన్ని జరగకుండా చేస్తారు.

VIRAL POSTS IN WHATSAPP
SOCIAL MEDIA (ETV Bharat)

పొస్టు పెట్టినా, దాన్ని పంపినా : సోషల్ మీడియా వినియోగం ఈ కాలంలో విపరీతంగా పెరిగింది. మనకు వచ్చిన సమాచారం పరిశీలించకుండా ఇతరులకు ఫార్వర్డ్ చేసినా అది చట్ట ప్రకారం నేరమే. దీంతోపాటు వాటి గురించి తెలుసుకోకుండా వాట్సాప్‌లో స్టేటస్‌లు పేడితే జైలుకు వెళ్లే ప్రమాదం ఉంది. రెండు వర్గాల మధ్య ఘర్షణలు కలిగేలా, వ్యక్తిగత ఏవరినైనా నష్టపరిచినా, సున్నితమైన అంశాలపై అవగాహన కొరవడి స్పందించినా ఊచలు లెక్కపెట్టాల్సిందే. అలాంటి పోస్టులు పెట్టడం ఎంత ప్రమాదమో, వాటిని వైరల్‌ చేయడమూ అంతే నష్టాన్ని చేకూరుస్తుంది.

రహదారిపై ధాన్యపు రాశులు : రాష్ట్రంలోని రహదారులపై రైతులు ధాన్యం ఆరబెడుతుంటారు. రాత్రి సమయంలో కుప్పగా వేసి వదిలేస్తారు. ఇది గమనించకుండా వెళ్లి వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. పలు సందర్భాల్లో మృతి చెందిన ఘటనలూ ఉన్నాయి. రోడ్లపై ధాన్యం ఆరబెడితే చట్టప్రకారం శిక్షలు ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు.

రహదారులపై వాహనాలు నిలిపి ఉంచిన సమయంలో ముందు, వెనక నుంచి వచ్చే వాహనాలకు కనిపించే విధంగా ఉండాలి. లేదంటే కేసు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇబ్బంది లేకుండా నిలిపినప్పుడు ఎవరైనా వాహనదారుడు వచ్చి ఢీ కొడితే తప్పు వారిదే అవుతుంది.

మీరు సోషల్ మీడియా యాక్టివ్​ యూజర్​లా? - అలాంటి పోస్టులు పెడితే జైలుకే! తస్మాత్ జాగ్రత్త

'విద్యార్థినులు అనుమతి లేకుండా నెలకు పైగా బడికి రావట్లేదా - అయితే అప్రమత్తం కండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.