ETV Bharat / business

చెప్పులు, సూపర్​ బైక్​లు ఇక చీప్​! ధరలు తగ్గే, పెరిగే వస్తువులివే! - UNION BUDGET 2025 GOODS PRICE

బడ్జెట్​లో పలు ఉత్పత్తులపై కస్టమ్స్​ డ్యూటీ సవరించిన కేంద్రం - ధరలు తగ్గేవి, పెరిగే వస్తువులు ఇవే!

Union Budget 2025 Goods Price
Union Budget 2025 Goods Price (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2025, 3:02 PM IST

Union Budget 2025 Goods Price : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్​సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్​లో రోజువారీ అవసరాలకు కీలకమైన పలు ఉత్పత్తులు, వస్తువులపై బేసిక్ కస్టమ్స్​ డ్యూటీ (బీసీడీ)లో అనేక మార్పులు ప్రతిపాదించారు. అందులో భాగంగా క్యాన్సర్​, అరుదైన వ్యాధులు, దీర్ఘకాల వ్యాధులకు ఉపయోగించే డ్రగ్స్​, ఔషధాలపై కస్టమ్స్​ డ్యూటీని పూర్తిగా తొలగించారు. దీంతో 36 రకాల ఔషధాల ధరలు తగ్గనున్నాయి. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే లిథియం అయాన్​ బ్యాటరీలు, క్యారియర్ గ్రేడ్ ఈథర్​నెట్​ స్విచ్​లు, దిగుమతి చేసుకున్న ప్రీమియం కార్లు, మోటార్​ సైకిళ్లు వంటి వాటి ధరలు తగ్గనున్నాయి. ఇక, పూర్తి​ యూనిట్​గా దిగుమతి చేసుకున్న ఇంటరాక్టివ్ ఫ్లాట్​ ప్యానెల్ డస్​ప్లేలు (టచ్ స్క్రీన్లు), నిట్టెడ్ ఫ్యాబ్రిక్స్​ వంటి వాటి ధరలు పెరిగాయి.

ధరలు తగ్గేవి

  • 40,000 యూఎస్ డాలర్లు కంటే ఎక్కువ ధర లేదా 3,000 cc కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన దిగుమతి చేసుకున్న కార్లు
  • 1600cc లోపు లేదా ఆపై ఇంజిన్ సామర్థ్యం కలిగిన పూర్తి​ యూనిట్​గా (కంప్లీట్లీ బిల్ట్​ యూనిట్-సీబీయూ) దిగుమతి చేసుకున్న మోటార్‌సైకిళ్లు
  • 1600cc లోపు లేదా ఆపై ఇంజిన్ సామర్థ్యం కలిగిన సెమీ-నాక్డ్​ డౌన్​(ఎస్​కేడీ) రూపంలో దిగుమతి చేసుకున్న మోటార్‌సైకిళ్లు
  • 1600cc లోపు లేదా ఆపై ఇంజిన్ సామర్థ్యం కలిగిన కంప్లీట్లీ-నాక్డ్​ డౌన్​ రూపంలో దిగుమతి చేసుకున్న మోటార్‌సైకిళ్లు
  • 10 లేదా అంతకంటే ఎక్కువ మంది రవాణా కోసం దిగుమతి చేసుకున్న వాహనాలు
  • ఎలక్ట్రానిక్ బొమ్మల విడిభాగాలు
  • ఆహారం, పానీయాల పరిశ్రమలలో ఉపయోగించే సింథటిక్ ఫ్లేవర్ ఎసెన్స్‌లు, మిశ్రమాలు
  • ఆభరణాల వస్తువులు, స్వర్ణకారులు, వెండి పనులు చేసేవారి సామాను
  • క్యారియర్​ గ్రేడ్​ ఈథర్​నెట్​ స్విచ్​లు

ధరలు పెరిగేవి ఇవే

  • స్మార్ట్​ మీటర్లు
  • సోలార్​ సెల్స్​
  • దిగుమతి చేసుకున్న ఫుట్​వేర్
  • దిగుమతి చేసుకున్న క్యాండిల్స్, టేపర్స్​
  • దిగుమతి చేసుకున్న యాట్​(ఒక రకమైన పడవ), వెసెల్స్​
  • పీవీసీ ఫ్లెక్స్​ ఫిల్మ్స్​, పీవీసీ ఫ్లెక్స్​ షీట్స్, పీసీవీ ఫ్లెక్స్​ బ్యానర్
  • దిగుమతి చేసుకున్న నిట్టెడ్ ఫ్యాబ్రిక్స్
  • ఇంటరాక్టివ్ ఫ్లాట్​ ప్యానెల్ డిస్​ప్లేలు(పూర్తి యూనిట్​గా దిగుమతి చేసుకుంటే)

అంతేకాకుండా వెట్​బ్లూ లెదర్, క్రస్ట్​ లెదర్​పై కస్టమ్స్​ డ్యూటీ నుంచి కేంద్రం మినహాయింపు ఇచ్చింది. ఫ్రొజెన్​ ఫిష్​ పేస్ట్​ (సురిని)పై కస్టమ్స్​ డ్యూటీని 30శాతం నుంచి 5శాతానికి తగ్గించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.